త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI Recruitment | SBI జూనియ‌ర్ అసోసియేట్స్ రిక్రూట్‌మెంట్‌.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ

SBI Recruitment | దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ (SBI)లో నిరుద్యోగులో మ‌రోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవలే 1538 పోస్టుల‌తో బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన స్టేట్‌బ్యాంక్‌.. తాజాగా 9,124 జూనియర్‌ అసోసియేట్స్‌ (కస్టమర్‌ సపోర్టు అండ్‌ సేల్స్‌) పోస్టుల భర్తీకి నియామ‌క ప్ర‌క్రియ (SBI Recruitment) చేప‌ట్టింది.

G

National | Published On Aug 12, 2026, 7.01 am IST

SBI Recruitment | SBI జూనియ‌ర్ అసోసియేట్స్ రిక్రూట్‌మెంట్‌.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ
Advertisement

SBI Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ (SBI)లో నిరుద్యోగులో మ‌రోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవలే 1538 పోస్టుల‌తో బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన స్టేట్‌బ్యాంక్‌.. తాజాగా 9,124 జూనియర్‌ అసోసియేట్స్‌ (కస్టమర్‌ సపోర్టు అండ్‌ సేల్స్‌) పోస్టుల భర్తీకి నియామ‌క ప్ర‌క్రియ (SBI Recruitment) చేప‌ట్టింది. ఆన్‌లైన్ ద‌రఖాస్తులు https://sbi.bank.in/web/careers/current-openings వెబ్‌సైట్‌లో ఆగస్టు 31 వరకు చేసుకోవచ్చు. స్థానిక భాష‌లో ప్రావీణ్యం త‌ప్ప‌నిస‌రి. రాత‌ప‌రీక్ష ఆధారంగా నియామాలు ఉంటాయి. తెలంగాణ‌లో 260 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన వారికి ప్ర‌తినెల రూ.24,050 నుంచి రూ.64,480 వ‌ర‌కు జీతం వ‌స్తుంది. ఆరు నెల‌ల‌పాటు ప్రొబేష‌న్ పీరియ‌డ్ ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 9124

పోస్టు పేరు: జూనియర్‌ అసోసియేట్స్‌ (కస్టమర్‌ సపోర్టు అండ్‌ సేల్స్‌)
ఇందులో రెగ్యుల‌ర్ 7680, బ్యాక్‌లాగ్ 1444 చొప్పున పోస్టులు ఉన్నాయి.
హైద‌రాబాద్ స‌ర్కిల్‌లో 260 (ఎస్సీ 41, ఎస్టీ 18, ఓబీసీ 70, ఈడ‌బ్ల్యూఎస్ 26, జ‌న‌ర‌ల్ 105), బ్యాక్‌లాగ్ ఖాళీలు లేవు.

అర్హ‌త‌లు: డ‌గ్రీ లేదా త‌త్స‌మాన కోర్సులో ఉత్తీర్ణ‌త‌. 2026, ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉండాలి. డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న‌వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. కానీ డీసెంబ‌ర్ 31 కంటే ముందే సంబంధిత ఆధారాల‌ను స‌మ‌ర్పించాలి.

ఎంపిక విధానం: మూడు ద‌శ‌ల్లో ఉంటుంది. ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్‌, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌.

ప్రిలిమిన‌రీ

ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌100 మార్కులు ఉంటుంది. 100 ప్ర‌శ్న‌లు అడుగుతారు. గంట‌లో పరీక్ష పూర్తిచేయాలి.

  • ఇంగ్లిష్ లాంగ్వేజ్- 30 ప్ర‌శ్న‌లు, 30 మార్కులు
  • న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ- 35 ప్ర‌శ్న‌లు, 35 మార్కులు
  • రీజ‌నింగ్- 35 ప్ర‌శ్న‌లు, 35 మార్కులు
  • ప్ర‌తి విభాగానికి 20 నిమిషాలు కేటాయించారు.

మెయిన్ ఎగ్జామ్‌

మొత్తం 200 మార్కుల‌కు ఉంటుంది. 190 ప్ర‌శ్న‌లు అడుగుతారు. 2.40 గంట‌ల స‌మ‌యం ఇస్తారు.

  • జ‌న‌ర‌ల్ లేదా ఫైనాన్షియ‌ల్ అవేర్‌నెస్- 50 ప్ర‌శ్న‌లు 50 మార్కులు- 35 నిమిషాలు
  • జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్- 40 ప్ర‌శ్న‌లు 40 మార్కులు- 35 నిమిషాలు
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 50 ప్ర‌శ్న‌లు 50 మార్కులు- 45 నిమిషాలు
  • రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూట‌ర్ ఆప్టిట్యూడ్‌- 50 ప్ర‌శ్న‌లు 60 మార్కులు- 45 నిమిషాలు

నోట్‌: నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 0.25 మార్కుల చొప్పున‌ కోత‌విధిస్తారు.

లోక‌ల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌: నాన్ వెర్బ‌ల్ టెస్ట్‌- 3 ప్యాసేజ్‌లు, 15 ప్ర‌శ్న‌లు- 15 మార్కులు, వెర్బ‌ల్ టెస్ట్‌- 20 మార్కులు

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు ఎలాంటి ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 31
ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌: సెప్టెంబ‌ర్‌లో
మెయిన్ ప‌రీక్ష: న‌వంబ‌ర్‌లో
ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌
వెబ్‌సైట్‌: https://sbi.bank.in/web/careers/current-openings

పూర్తివివ‌రాలు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Advertisement

తాజావార్తలు

Advertisement