SBI | ఎస్‌బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం
SBI | ఇప్పటికే 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. తాజాగా ఉద్యోగార్ధులకు మరో అప్‌డేట్ ఇచ్చింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (Medical Officer) నియామకాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
SBI | త్రినేత్ర.న్యూస్: ఇప్పటికే 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. తాజాగా ఉద్యోగార్ధులకు మరో అప్‌డేట్ ఇచ్చింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (Medical Officer) నియామకాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. దీనిద్వారా 35 పోస్టులకు రిక్రూట్‌మెంట్ (SBI Recruitment) ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు జూలై 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు జీతం వస్తుంది. హైదరబాద్‌లో కూడా పోస్టులు ఉన్నాయి. నియామక ప్రక్రియను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై చేపట్టింది.
పోస్టుపేరు: బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ (బీఎంఓ-II)
మొత్తం ఖాళీలు: 35
అర్హతలు: ఎంబీబీఎస్, పీజీ డిప్లొమా పూర్తి చేయాలి. కనీసం ఐదేండ్ల ఉద్యోగ అనుభవం తప్పనిసరి. మే 31, 2026 నాటికి 35 ఏండ్ల వయస్సు కలిగి, స్థానిక భాష తెలిసి ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాలి. రీజనింగ్ 15, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 15, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20, ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కు సంబంధించి 50 మార్కు లకు ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి కోత విధిస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 14
వెబ్‌సైట్: https://sbi.bank.in/web/careers/current-openings
పూర్తివివరాలకు..
తాజావార్తలు
- ●Supreme Court | 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు
- ●Kiara advani | నయనతార భర్త సినిమాను రిజెక్ట్ చేసిన కియారా అద్వానీ - కోలీవుడ్ డెబ్యూ ఛాన్స్ మిస్
- ●DGP Anand | ఎంపీ గారు.. మీపై నిఘా కోసం ఎవరినీ నియమించలే: డీజీపీ సీవీ ఆనంద్
- ●Bitcoin | క్రిప్టో మార్కెట్లలో బుల్ ర్యాలీ.. 80వేల డాలర్లకు చేరిన బిట్‌కాయిన్..
- ●Girlfriend leaves 3,400 kiss marks on car | ప్రియుడి కారుపై ప్రేయసి 3,400 కిస్ సింబల్స్.. వైరల్ కోసం యువకుడి వింత ఆలోచన
- ●Drugs Smuggling | డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్ హోస్టెస్

Supreme Court | 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు

Kiara advani | నయనతార భర్త సినిమాను రిజెక్ట్ చేసిన కియారా అద్వానీ - కోలీవుడ్ డెబ్యూ ఛాన్స్ మిస్

DGP Anand | ఎంపీ గారు.. మీపై నిఘా కోసం ఎవరినీ నియమించలే: డీజీపీ సీవీ ఆనంద్

Bitcoin | క్రిప్టో మార్కెట్లలో బుల్ ర్యాలీ.. 80వేల డాలర్లకు చేరిన బిట్‌కాయిన్..






