త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI Clerk Recruitment | 1538 పోస్టుల‌తో ఎస్‌బీఐ క్ల‌ర్క్ నోటిఫికేష‌న్‌.. తెలంగాణ‌లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే?

SBI Clerk Recruitment | దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశ‌వ్యాప్తంగా వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 1,538 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (SBI Clerk Recruitment) విడుదల చేసింది.

G

National | Published On Aug 9, 2026, 1.50 pm IST

SBI Clerk Recruitment | 1538 పోస్టుల‌తో ఎస్‌బీఐ క్ల‌ర్క్ నోటిఫికేష‌న్‌.. తెలంగాణ‌లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే?
Advertisement

SBI Clerk Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశ‌వ్యాప్తంగా వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 1,538 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (SBI Clerk Recruitment) విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు. ఆగస్టు 27 వరకు sbi.bank.in/web/careers/current-openings వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత‌ప‌రీక్ష ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన‌వారికి రూ.46 వేల వ‌ర‌కు ప్ర‌తి నెల జీతం వ‌స్తుంది. స్థానిక భాష తెలిసి ఉండాలి. తెలంగాణ‌లో 32, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 88 ఖాళీలు ఉన్నాయి.

పోస్టుపేరు: జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్‌ సేల్స్)
మొత్తం ఖాళీలు: 1,538 ఖాళీలు
ఇందులో ఎస్టీ 1219, ఎస్సీ 207, ఓబీసీల‌కు 112 చొప్పున ఉన్నాయి.

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారుకూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే డిసెంబర్ 31 కంటే ముందే సంబంధిత ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం వ‌చ్చి ఉండాలి. 2026 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్​లైన్​లో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, స్థానిక భాషా పరీక్ష (LLPT) ఆధారంగా.

ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌: 100 మార్కులు ఉంటుంది. 100 ప్ర‌శ్న‌లు అడుగుతారు. గంట‌లో పరీక్ష పూర్తిచేయాలి.

  • ఇంగ్లిష్ లాంగ్వేజ్- 30 ప్ర‌శ్న‌లు, 30 మార్కులు
  • న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ- 35 ప్ర‌శ్న‌లు, 35 మార్కులు
  • రీజ‌నింగ్- 35 ప్ర‌శ్న‌లు, 35 మార్కులు
  • ప్ర‌తి విభాగానికి 20 నిమిషాలు కేటాయించారు.

మెయిన్ ఎగ్జామ్‌: మొత్తం 200 మార్కుల‌కు ఉంటుంది. 190 ప్ర‌శ్న‌లు అడుగుతారు. 2.40 గంట‌ల స‌మ‌యం ఇస్తారు.

  • జ‌న‌ర‌ల్ లేదా ఫైనాన్షియ‌ల్ అవేర్‌నెస్- 50 ప్ర‌శ్న‌లు 50 మార్కులు- 35 నిమిషాలు
  • జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్- 40 ప్ర‌శ్న‌లు 40 మార్కులు- 35 నిమిషాలు
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 50 ప్ర‌శ్న‌లు 50 మార్కులు- 45 నిమిషాలు
  • రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూట‌ర్ ఆప్టిట్యూడ్‌- 50 ప్ర‌శ్న‌లు 60 మార్కులు- 45 నిమిషాలు

నోట్‌: నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 0.25 మార్కుల చొప్పున‌ కోత‌విధిస్తారు.

లోక‌ల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌: నాన్ వెర్బ‌ల్ టెస్ట్‌- 3 ప్యాసేజ్‌లు, 15 ప్ర‌శ్న‌లు- 15 మార్కులు, వెర్బ‌ల్ టెస్ట్‌- 20 మార్కులు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 27
ప్రిలిమినరీ పరీక్ష: సెప్టెంబర్‌లో ఉండొచ్చు.
మెయిన్‌ పరీక్ష: అక్టోబర్‌/నవంబర్‌లో
ప‌రీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌
వెబ్​సైట్: sbi.bank.in/web/careers/current-openings

Advertisement
Advertisement