త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Goud | పార్టీ సంస్థాగ‌త నిర్మాణ‌మే ల‌క్ష్యంగా సంఘ‌ట‌న స‌జృన్ అభియాన్ : పీసీసీ చీఫ్‌

Mahesh Goud | పార్టీ సంస్థాగత నిర్మాణ బలోపేతమే లక్ష్యంగా ‘సంఘటన సృజన్ అభియాన్’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కొత్త డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

P

Telangana | Published On May 29, 2026, 8.18 pm IST

Mahesh Goud | పార్టీ సంస్థాగ‌త నిర్మాణ‌మే ల‌క్ష్యంగా సంఘ‌ట‌న స‌జృన్ అభియాన్ : పీసీసీ చీఫ్‌
Advertisement

Mahesh Goud | పార్టీ సంస్థాగత నిర్మాణ బలోపేతమే లక్ష్యంగా ‘సంఘటన సృజన్ అభియాన్’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కొత్త డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పార్టీ నిర్మాణం, సంస్థాగత వ్యవస్థపై సూచనలు, సమాలోచనలు నిర్వహించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దేశంలో సెక్యులర్ ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని మహేష్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తగ్గించి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సరళి ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

బెంగాల్‌లో 92 లక్షల ఓట్లు తొలగించగా, అభ్యర్థనలు వచ్చిన తర్వాత కేవలం 31 లక్షల ఓట్లు మాత్రమే మళ్లీ జాబితాలో చేర్చారని తెలిపారు. అక్కడ ప్రభుత్వ మార్పుకు సుమారు 30 లక్షల ఓట్లే కారణమయ్యాయని చెప్పారు. బెంగాల్ తర్వాత ఫాసిస్టు ప్రభుత్వం పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేసే సత్తా ఉన్న వారినే డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేశామని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని పూర్తి జాబితాను పంపించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

Advertisement
Advertisement