Noida Airport | నోయిడా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు మొదలు.. తొలి విమానంలో ప్రయాణించిన భూములిచ్చిన రైతులు
Noida Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (Noida International Airport)లో (జేవర్) విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం లక్నో (Lucknow) నుంచి వచ్చిన ఇండిగో (IndiGo) విమానం విజయవంతంగా ల్యాండ్ అయ్యింది.
Noida Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (Noida International Airport)లో (జేవర్) విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం లక్నో (Lucknow) నుంచి వచ్చిన ఇండిగో (IndiGo) విమానం విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత ఈ ఎయిర్‌పోర్టు నుంచి లక్నోకు తొలి విమానం టేకాఫ్ తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం తమ వేలాది ఎకరాల భూములను త్యాగం చేసిన జేవార్ (Jewar) ప్రాంతానికి చెందిన రైతులకు ఈ విమానంలో ప్రయాణించే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం కల్పించింది.
ఎయిర్‌పోర్ట్ అధికారుల సమాచారం ప్రకారం.. ఇండిగో విమానం '6E 2278' సోమవారం ఉదయం 7:12 గంటలకు లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయి ఉదయం 7:58 గంటలకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానం రాకతో జేవార్ (Jewar) కేంద్రంగా నిర్మించిన విమానాశ్రయంలో విమాన రాకపోకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఈ ఎయిర్‌పోర్టు నుంచి తొలి విమానం ఉదయం 8:19 గంటలకు టేకాఫ్ అయ్యింది. ఇందులో భూమిలిచ్చిన రైతులతోపాటూ జేవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్, యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA) సీఈవో రాకేష్ సింగ్, అడిషనల్ సీఈవో శైలేంద్ర భాటియా తదితర అధికారులు ప్రయాణించారు.
ఈ విమానాశ్రయాన్ని మార్చి 28న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో దేశీయ, కార్గో టెర్మినల్స్ నిర్మాణం పూర్తయ్యింది. 3900 మీటర్ల పొడవైన రన్‌వే, ప్రయాణికుల టర్మినల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC), కార్గో హబ్ ఉన్నాయి. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారనుంది. ప్రతి ప్రయాణికుడిపై సుమారు రూ.496 ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా.
#WATCH | Jewar, UP | Noida International Airport's first commercial flight takes off for Lucknow.
The passengers of the flight include farmers who gave their land for the airport. They will meet UP CM Yogi Adityanath at a programme organised in the city.
(Pics and Video: Jewar… pic.twitter.com/jRomgrEC3u
— ANI (@ANI) June 15, 2026
Also Read..
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ
తుదిదశలో అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు.. త్వరలోనే నివేదిక : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుడిని కాదు : రాఘవ లారెన్స్
తాజావార్తలు
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!






