Sangma vs Sangma | సంగ్మా వర్సెస్ సంగ్మా.. అసెంబ్లీలో భార్యాభర్తల మధ్య ఆసక్తికర సన్నివేశం
Sangma vs Sangma | మేఘాలయ అసెంబ్లీలో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల్లో భాగంగా సీఎం సంగ్మాను ఎన్‌పీపీ ఎమ్మెల్యే మెహతబ్ చాందీ ఏ సంగ్మా పలు అంశాలపై ప్రశ్నించారు.
Sangma vs Sangma | త్రినేత్ర.న్యూస్ : ఆయా రాష్ట్రాల్లో రాజకీయ కుటుంబాలకు చెందిన భార్యాభర్తలు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణలో అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక మేఘాలయలోనూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా భార్య మెహతబ్ చాందీ ఏ సంగ్మా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మేఘాలయ అసెంబ్లీలో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల్లో భాగంగా సీఎం సంగ్మాను ఎన్‌పీపీ ఎమ్మెల్యే మెహతబ్ చాందీ ఏ సంగ్మా పలు అంశాలపై ప్రశ్నించారు. దీంతో భార్య అడిగిన ప్రతి ప్రశ్నకు సీఎం సంగ్మా సవివరంగా సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మధ్య ఆరు నిమిషాల పాటు చర్చ జరిగింది.
గాంబేగ్రే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మెహతబ్ చాందీ ఏ సంగ్మా.. వెటర్నరీ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనపై సీఎంను ప్రశ్నిస్తూ.. స్పష్టత ఇవ్వాలని కోరారు. రెండు ఫిషరీ కాలేజీలు, ఒక డెయిరీ కాలేజీ ఏర్పాటు చేస్తామని మంత్రివర్గం 2022లోనే ఆమోదించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలోని వెటర్నరీ శిక్షణ కేంద్రాల్లో సరిపడా సిబ్బంది లేని విషయాన్ని ఆమె ఎత్తిచూపారు.
అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే అయిన భార్య అడిగిన ప్రశ్నకు సీఎం హుందాగా సమాధానం ఇచ్చారు. కాలేజీల ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్‌లు తయారు చేస్తున్నట్లు సీఎం వివరించారు. త్వరలోనే భూసేకరణ చేపట్టి.. నిర్మాణాలు చేపడుతామన్నారు. వెటర్నరీ కాలేజీ కోసం రీ బోయిలో 800 ఎకరాల స్థలాన్ని గుర్తించామని, త్వరలోనే రూ. 334 కోట్లతో నిర్మాణం చేపడుతామన్నారు. సిబ్బంది లేమిని అంగీకరించిన సీఎం, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు.
https://x.com/orugalluupdates/status/2026690263729713392
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






