Ethics committee | వరుసగా మూడోసారి వాయిదా పడ్డ ఎథిక్స్ కమిటీ సమావేశం
Ethics committee | శుక్రవారం జరగాల్సిన ఎథిక్స్ కమిటీ( Ethics committee ) సమావేశం మరోసారి వాయిదా పడింది. దీంతో ఎథిక్స్ కమిటీ వాయిదా పడడం ఇది మూడోసారి.
Ethics committee | త్రినేత్ర న్యూస్ : శుక్రవారం జరగాల్సిన ఎథిక్స్ కమిటీ( Ethics committee ) సమావేశం మరోసారి వాయిదా పడింది. దీంతో ఎథిక్స్ కమిటీ వాయిదా పడడం ఇది మూడోసారి. ఈ నెల 8, 13 తేదీల్లో జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి( Padi Kaushik Reddy ) అంశంపై ఎథిక్స్ కమిటీ ఏం నిర్ణయం తీసుకోబోతుందని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
అసలేం జరిగిందంటే..?
గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో( 2026 మార్చి 26) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి.. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహరించిన తీరుపై శాసనసభ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వైపు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేయి చూపిస్తూ బెదిరించారని, అసభ్య పదజాలంతో దూషించారన్న అభియోగాలను కాంగ్రెస్ సభ్యులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సభ హుందాతనాన్ని కాపాడేందుకు ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణించాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. భవిష్యత్తులో శాసనసభ సమావేశాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో కౌశిక్ రెడ్డికి వివరణ ఇవ్వాలని కోరుతూ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 29న అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ సమావేశమై చర్చించింది. అనంతరం సెప్టెంబర్ 30న కూడా సమావేశమైంది. కానీ కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ సమయంలో అక్టోబర్ 7లోపు వివరణ ఇవ్వాలని కౌశిక్ రెడ్డికి కమిటీ గడువు ఇచ్చింది. కడియం శ్రీహరి మాట్లాడిన వీడియో కావాలని బీఆర్ఎస్ అడగ్గా, వీడియో ఇచ్చేందుకు కమిటీ అంగీకారం తెలిపింది. అక్టోబర్ 8వ తేదీన మరోసారి ఎథిక్స్ కమిటీ భేటీ కావాలని నిర్ణయించినప్పటికీ ఆ సమావేశం కూడా వాయిదా పడింది. మొత్తానికి కౌశిక్‌రెడ్డి సమర్పించిన 12 పేజీల వివరణపై చర్చించేందుకు ఈ నెల 13న ఎథిక్స్ కమిటీ సమావేశమై చర్చించాలని నిర్ణయించింది. కానీ అది జరగలేదు. ఇవాళ జరగాల్సిన సమావేశం కూడా మరోసారి వాయిదా పడడం చర్చనీయాంశమైంది.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీకి జీవో జారీ: పొన్నం ప్రభాకర్
అక్టోబర్ 16, 2026

MLC Dasoju Sravan | ఏఈఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలి: దాసోజు శ్రవణ్
అక్టోబర్ 16, 2026

Ponnam Prabhakar | ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల కోసం రూ.425 కోట్లు: పొన్నం ప్రభాకర్
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీకి జీవో జారీ: పొన్నం ప్రభాకర్
- ●Supreme Court | వ్యాపారులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం.. సీజేపీ నిరసనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ●MLC Dasoju Sravan | ఏఈఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలి: దాసోజు శ్రవణ్
- ●Ponnam Prabhakar | ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల కోసం రూ.425 కోట్లు: పొన్నం ప్రభాకర్
- ●Tesla Roadster | ఇక గాల్లో ఎగరనున్న కార్లు.. ఎలాన్ మస్క్ సంచలనం..
- ●RS Praveen Kumar | మేడిగడ్డ విషయంలో కేసు నమోదు చేయకపోవడం కూడా నేరమే: ఆర్ఎస్ ప్రవీణ్

Ponnam Prabhakar | హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీకి జీవో జారీ: పొన్నం ప్రభాకర్

Supreme Court | వ్యాపారులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం.. సీజేపీ నిరసనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

MLC Dasoju Sravan | ఏఈఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలి: దాసోజు శ్రవణ్

Ponnam Prabhakar | ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల కోసం రూ.425 కోట్లు: పొన్నం ప్రభాకర్



