Samrat Choudhary | బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ఎన్నిక
Samrat Choudhary | బీహార్ తదుపరి ముఖ్యమంత్రి (Bihar CM)గా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) ఎన్నికయ్యారు. రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీశ్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Samrat Choudhary | బీహార్ తదుపరి ముఖ్యమంత్రి (Bihar CM)గా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) ఎన్నికయ్యారు. రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీశ్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి నూతన సీఎంను ఎంపిక చేసింది. బీజేపీ (BJP) శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ చౌదరి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ రికార్డు నెలకొల్పారు. బీజేపీ నుంచి బీహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న తొలి నేతగా రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటి వరకూ బీహార్ రాష్ట్రాన్ని జేడీయూ, ఆర్జేడీ నేతలే పాలించారు. అయితే, ఇప్పుడు తొలిసారి బీజేపీ నేత బీహార్ పగ్గాలు అందుకోబోతున్నారు. రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి.. 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సామ్రాట్ చౌదరి 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి బీహార్‌ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా, 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు.
Also Read..
వచ్చే ఏడాది హరిద్వార్‌లో కుంభమేళా.. దేవభూమిని శుభ్రంగా ఉంచుదాం : ప్రధాని మోదీ
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా.. మరికాసేపట్లో కొత్త సీఎం ఎంపిక
రిజర్వేషన్లు పొందడం వారి హక్కు.. ఇంకా వేచి చూడటం సబబు కాదు.. మహిళలకు ప్రధాని లేఖ
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



