త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalwakuntla Kavitha | రేవంత్.. నామినేష‌న్ ప‌ద్ధ‌తి టెండ‌ర్లు ర‌ద్దు చెయ్‌: క‌విత‌

Press meet | జీహెచ్ఎంసీ(GHMC)లో కాంగ్రెస్ భారీ ఎత్తున అవినీతికి (Corruption) పాల్పడుతోందని.. నామినేషన్ల పద్దతిని వెంటనే రద్దు చేసి కాంట్రాక్ట్ పద్ధ‌తి(Contract method)లో టెండర్లు (Tenders) పిల‌వాల‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత (Kalwakuntla Kavitha) డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నుంచే ఈ పద్ధ‌తి కొనసాగుతోందని.. ఇక కాంగ్రెస్ హ‌యాంలో అది పెచ్చుమీరింద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

S

News | Published On Apr 10, 2026, 2.24 pm IST

Kalwakuntla Kavitha | రేవంత్.. నామినేష‌న్ ప‌ద్ధ‌తి టెండ‌ర్లు ర‌ద్దు చెయ్‌: క‌విత‌
Advertisement
  • కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలోనే టెండ‌ర్లు పిల‌వాలే
  • అవినీతిని మ‌రింత‌ పెంచ‌డానికే ఫ్యూచ‌ర్ సిటీ డ్రామాలు ఆడుతున్న‌వ్‌
  • నీ అనుచ‌రుల‌కే కోట్ల ప‌నులు క‌ట్ట‌బెట్టిన‌వ్‌
  • బీఆర్ఎస్ హ‌యాంలోనే ఆ ప‌ద్ధ‌తి మొద‌లైంది
  • ఇప్పుడు మీ ప్ర‌భుత్వంలో పెచ్చుమీరింది
  • మీడియాతో కాంగ్రెస్‌పై క‌ల్వ‌కుంట్ల క‌విత ఫైర్‌

త్రినేత్ర‌.న్యూస్‌: జీహెచ్ఎంసీ(GHMC)లో కాంగ్రెస్ భారీ ఎత్తున అవినీతికి (Corruption) పాల్పడుతోందని.. నామినేషన్ల పద్దతిని వెంటనే రద్దు చేసి కాంట్రాక్ట్ పద్ధ‌తి(Contract method)లో టెండర్లు (Tenders) పిల‌వాల‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత (Kalwakuntla Kavitha) డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నుంచే ఈ పద్ధ‌తి కొనసాగుతోందని.. ఇక కాంగ్రెస్ హ‌యాంలో అది పెచ్చుమీరింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈమేర‌కు బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. 2017 నుంచి బీఆర్ఎస్ రూ.480 కోట్ల ప‌నుల‌ను కాంట్రాక్టర్లకు ఇవ్వ‌గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.1148 కోట్ల కాంట్రాక్టుల‌ను పూర్తిగా నామినేషన్ పద్ధ‌తిలో క‌ట్ట‌బెట్టింద‌న్నారు. ఈ పద్ధ‌తిలో కాంట్రాక్ట్ లు ఇవ్వొద్దని 2023లో వేసిన కమిటీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

జీహెచ్ఎంసీలో జ‌రిగే తీవ్ర అవినీతికి ముఖ్యమంత్రి రేవంత్ బాధ్య‌త వ‌హించాల‌న్నారు. సీఎం తన అనుచరులకు నామినేషన్ పద్ధతిలో టెండర్లు కట్టబెడుతున్నాడ‌ని ఆరోపించారు. గ్రామాల్లో సైతం 5 లక్షలు దాటితే టెండర్ రూపంలో ఇస్తామ‌ని.. ప‌ట్ట‌ణాల్లో రూ.50 కోట్లు దాటితే కచ్చితంగా టెండర్ పిలవాల్సిందేన‌ని చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో పనులన్నీ టెండ‌ర్ల ద్వారానే ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

రియ‌ల్ ఎస్టేట్ వాళ్ల‌ను బెదిరించొద్దు..

రియల్ ఎస్టేట్ సంస్థలను ఇప్పటికే హైడ్రా పేరుతో బెదిరించారు. స్క్వేర్ ఫీట్ కు 150 రూపాయల చొప్పున వారి వద్ద వసూలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించటం ఆపాలి. లేదంటే కాంగ్రెస్‌ అవినీతిపై ఈడీకి ఫిర్యాదు చేస్తాం అని క‌విత‌ హెచ్చ‌రించారు.

‘గుంపు మేస్త్రీ హయాంలో జరుగుతున్న మహా కరెప్షన్’..

జీహెచ్ఎంసీ అంటే ‘గుంపు మేస్త్రీ హయాంలో జరుగుతున్న మహా కరెప్షన్’ అని చెబుతున్నాం. ఈ అవినీతిని ఇంకా పెంచుకోవటానికి ఫ్యూచర్ సిటినీ ముందుకు పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ముందు హైదరాబాద్ సిటీని డెవలప్ చేయాలి. మీ అవినీతి కోసం హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ ను నాశనం చేయవద్దని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. జీహెచ్ఎంసీ ఏర్పడిన తర్వాత కొన్ని మంచి మార్పులు జరిగాయి. కానీ ఇప్పటికి కూడా చినుకు పడితే ఎక్కడి కార్లు అక్కడే నిలిచిపోయే పరిస్థితి ఉంది. హైదరాబాద్ అభివృద్ధి కోసం అంటూ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 35 వేల కోట్ల రూపాయల ప్లాట్ల‌ను అమ్మారు. కానీ ఆ డబ్బులు హైదరాబాద్ నగర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడలేదు.

కమీషన్ల కోసమే కాళేశ్వ‌రం మ‌ర‌మ్మ‌తులు..

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు మరమ్మతులు చేస్తామని కాంగ్రెస్ ముందుకు రావటాన్ని స్వాగతిస్తున్నా. కానీ కాళేశ్వరాన్ని వాడుకొని కమీషన్ల కోసం కక్కుర్తి పడొద్ద‌ని హెచ్చరిస్తున్నా. కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని చెప్పేందుకు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన కర్కోటక ప్రభుత్వం ఇది. ఈ విషయంలో కాంగ్రెస్ న‌మ్మ‌కంగా ప‌ని చేస్తుంద‌ని మాత్రం నేను నమ్మను. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం మరమ్మతుల‌కు ముందుకు వచ్చారనే అనుకుంటున్నం అని క‌విత పేర్కొన్నారు.

కాంగ్రెస్ అవినీతి చిట్టా మా ద‌గ్గ‌ర‌ ఉంది..

ఇది తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ కు పూర్తిగా వ్యతిరేకం. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. టెండర్లు పిలవటం కారణంగా మళ్లీ సగం వరకు ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది. హెచ్ఎండీఏకు ముఖ్యమంత్రే ఛైర్మన్, మున్సిపల్ మంత్రి వైస్ ఛైర్మన్ ఉంటాడు. కానీ మన ఖర్మ కొద్దీ ఈ ముఖ్యమంత్రే నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. వీళ్లు ఏదైతే నామినేషన పద్దతిలో టెండర్లు పిలిచారో ఆ డిపార్ట్ మెంట్ లో 6 వేల మంది పనిచేస్తున్నారు. వారికి 23 వేలకు పైగా జీతాలు ఇవ్వాల్సి ఉంటే రూ.13,500 లే ఇస్తున్నారు. నర్సరీ డిపార్ట్ మెంట్ లో మొక్కలు నాటడానికి, పెంచటానికి, పంచటానికి కాంగ్రెస్‌ చేసిన అవినీతి చిట్టా మా దగ్గర ఉంది అని క‌విత చెప్పారు.

సీఎం సిట్టింగ్‌తో సిట్ మాయం..

అవుట్ రింగ్ రోడ్ కు సంబంధించి ఒక కంపెనీ పై సిట్ వేశారు. కానీ ఆ సిట్ ఏమైందో తెలియదు. ముఖ్యమంత్రితో సిట్టింగ్ ద్వారా ఆ సిట్ మాయమైందా? అవుటర్ రింగ్ రోడ్ ను అమ్ముకున్నట్లుగా తయారు చేశారు. అక్కడ మెయింటెనెన్స్ కోసం మొత్తం ఖర్చు ప్రభుత్వం నుంచే పెడుతున్నారు. అసలు అవుటర్ మీద అవుతున్న ప్రమాదాల గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అక్కడ ఉండాల్సినంత మంది లేబర్లు కూడా లేరు. ముఖ్యమంత్రి వద్ద సంచులు మోసే వ్యక్తి ఈ డిపార్ట్ మెంట్ కు వైస్ ఛైర్మన్ అన్నట్లు ఉన్నాడు.

పార్టీ ఆవిర్భావ స‌భ‌కు 21 క‌మిటీలు..

జాగృతి పార్టీ ఏర్పాటు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 21 కమిటీలు వేశాం. ప్రతి కమిటీలో 30 మంది సభ్యులు ఉంటారు. వాలంటీర్లు 500 మంది ఉంటారు. సభ సజావుగా జరిగిలే ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు కమిటీ సభ్యులు చర్యలు తీసుకుంటారు. ఆ రోజు ప్రెస్ మిత్రులు తొందరగా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. కమిటీ వివరాలన్ని కూడా ఆన్ లైన్ లో ఫోన్ నంబర్లతో సహా ఉన్నాయి. సందేహాలుంటే కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరుతున్నా అని క‌విత సూచించారు.

బీజేపీ బీసీ వ్య‌తిరేక‌త‌ను చాటుకుంది..

మహిళా బిల్లు మీద పాత సెన్సెస్ అప్లయ్ చేయాల‌నుకోవటం అన్యాయం. ఇప్పటికే మొన్నటి లోక్ సభ ఎన్నికలతో పాటు 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మా అవకాశాలు పోయాయి. 2027 జనాభా లెక్కల వరకు ఆగితే మహిళలకు సీట్లు పెరుగుతాయని మా ఆలోచన. ఈసారి జనాభా లెక్కల్లో బీసీల జనగణనన కూడా చేస్తామని చెప్పారు. దాని ద్వారా బీసీ మహిళలకు కూడా అవకాశాలు వస్తాయని మేము భావిస్తున్నం. కానీ బీజేపీ అప్పటి వరకు ఆగకుండా బీసీల పట్ల తమకు ఉన్న వ్యతిరేకతను చాటుకుంటోంది. బీసీ బిడ్డలు, ఆడబిడ్డలు దీని మీద పోరాటం చేయాలి.
2027 తర్వాత మహిళ రిజర్వేష్లన్లు అమలు చేస్తే మంచి అవకాశాలు వస్తాయి. తెలంగాణ ఆడబిడ్డలు స్వయంప్రతిపత్తి కలిగి ఆలోచన శక్తి ఉన్నవాళ్లు. ఇక డ్రాఫ్ట్ బిల్లు గురించి స్టడీ చేస్తున్నాం. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తాం.

అర‌వింద్‌ది పురుషాహంకారం..

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కు తెలివి లేద‌ని.. ఆయన ఏం మాట్లాడుతాడో కూడా ఆయనకే తెల్వ‌దని ఎద్దేవా చేశారు. తాను తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి ప్రజల మధ్యలో బతికి ప్రజల మధ్యలో ఉండేందుకు వచ్చానన్నారు. త‌న‌లాంటి వాళ్లను ఎవరో మద్దతిస్తే బతుకుతానని అనటం అర‌వింద్‌ పురుషాహంకారానికి నిదర్శనమ‌ని చెప్పారు. మళ్లీ అలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని చెప్పేందుకే తాను వీడియో సందేశం విడుద‌ల చేశాన‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని కేరళ ప్రజలు గుర్తించి అక్కడ లిబరల్ ఫ్రంట్ ను గెలిపిస్తే నేను సంతోషిస్తా క‌విత పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement