త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Invitation to KTR | ‘వైశాఖి’ వేడుకలకు రండి.. కేటీఆర్‌ను ఆహ్వానించిన అమీర్‌పేట్ గురుద్వారా కమిటీ

Invitation to KTR | ఖల్సా సాజన దివస్ - వైశాఖి వేడుకలకు రావాల‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను అమీర్‌పేట్‌ గురుద్వారా  ప్రతినిధులు శుక్ర‌వారం ఆహ్వానించారు. ఈ పండ‌గ‌ను సిక్కు సమాజం అత్యంత పవిత్రంగా జ‌రుపుకొంటుంద‌న్నారు.

S

News | Published On Apr 10, 2026, 12.57 pm IST

Invitation to KTR | ‘వైశాఖి’ వేడుకలకు రండి.. కేటీఆర్‌ను ఆహ్వానించిన అమీర్‌పేట్ గురుద్వారా కమిటీ
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఖల్సా సాజన దివస్ - వైశాఖి వేడుకలకు రావాల‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను అమీర్‌పేట్‌ గురుద్వారా  ప్రతినిధులు శుక్ర‌వారం ఆహ్వానించారు. గురుద్వారా కమిటీ అధ్యక్షుడు ఎస్.దర్శన్ సింగ్ (Darshan Singh) ఆధ్వర్యంలోని బృందం స‌భ్యులు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ ఆధ్వర్యంలో కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక(Invitation card)ను అందజేశారు. ఈ పండ‌గ‌ను సిక్కు సమాజం అత్యంత పవిత్రంగా జ‌రుపుకొంటుంద‌న్నారు.

అమీర్‌పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న‌ మధ్యాహ్నం 1:30 గంటలకు వేడుక‌లు నిర్వ‌హిస్తామ‌ని క‌మిటీ స‌భ్యులు తెలిపారు. అమీర్‌పేట్‌లోని గురు గోవింద్ సింగ్‌జీ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ (మున్సిపల్ ప్లే గ్రౌండ్స్)లో కార్య‌క్ర‌మం ఉంటుంద‌న్నారు. ఈ ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని వారు విజ్ఞ‌ప్తి చేశారు. గురు సాహెబ్ ఆశీస్సులు తీసుకోవాలని కేటీఆర్ ను కోరారు. పంజాబ్ నుంచి వ‌చ్చిన‌ మత ప్రచారకుల‌తో గుర్బానీ కీర్తనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. సుమారు 8,000 నుంచి 8,500 మంది భక్తులు హాజరవుతారని కమిటీ ప్రతినిధులు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో గురుద్వారా సాహెబ్ అమీర్‌పేట్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement