త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణ‌లో నాలుగురోజులు వ‌డ‌గాలులు, వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..

TG Weather | పగటిపూట మండే ఎండ‌లు.. సాయంత్రం ఒక్క‌సారిగా కమ్ముకునే మేఘాలు.. వ‌డ‌గాలుల బీభ‌త్సం.. ఆపై ఉరుములు–మెరుపులతో కురిసే వర్షాలు ఇలా రాష్ట్రంలో వింత వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంది. నైరుతి రుతుప‌వ‌నాలు రాష్ట్రాన్ని తాకినా ఇంకా భానుడు త‌న ప్ర‌తాపాన్ని చూపుతూనే ఉన్నాడు.

P

Telangana | Published On Jun 17, 2026, 5.45 pm IST

TG Weather | తెలంగాణ‌లో నాలుగురోజులు వ‌డ‌గాలులు, వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..
Advertisement

TG Weather | పగటిపూట మండే ఎండ‌లు.. సాయంత్రం ఒక్క‌సారిగా కమ్ముకునే మేఘాలు.. వ‌డ‌గాలుల బీభ‌త్సం.. ఆపై ఉరుములు–మెరుపులతో కురిసే వర్షాలు ఇలా రాష్ట్రంలో వింత వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంది. నైరుతి రుతుప‌వ‌నాలు రాష్ట్రాన్ని తాకినా ఇంకా భానుడు త‌న ప్ర‌తాపాన్ని చూపుతూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే మ‌రో నాలుగు రోజులు పాటు రాష్ట్రంలో అక్క‌డ‌క్క‌డ వ‌డ‌గాలులు వీయ‌డంతో పాటు ప‌లుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. బుధ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల జిల్లాల్లో వ‌డ‌గాలులు వీచే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింంది. యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వాన‌లు కురిసే ఛాన్స్ ఉంద‌ని చెప్పింది.

గురువారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌డ‌గాలులు వీస్తాయ‌ని తెలిపింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, జిల్లాల్లో అక్క‌డ‌క్కడ వాన‌లు ప‌డేందుకు ఆస్కార‌ముంద‌ని చెప్పింది. శుక్ర‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిజామాబాద్‌, నిర్మ‌ల్‌, జ‌గిత్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం ఖ‌మ్మం జిల్లాల్లో వ‌డ‌గాలులు వీచే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది. క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని వివ‌రించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement