Soumitra Banerjee | దొంగ, దొంగ అంటూ.. మరో టీఎంసీ నేతపై కోడిగుడ్లతో దాడి.. వీడియో వైరల్
Soumitra Banerjee | పశ్చిమ బెంగాల్‌లో మరో టీఎంసీ నేతపై దాడి జరిగింది. సౌమిత్ర బెనర్జీ (Soumitra Banerjee)పై కొందరు కోడిగుడ్లతో దాడి చేశారు (attacked with eggs). బర్ధమాన్ జిల్లా రాణిగంజ్ నగరంలో (Raniganj city) ఈ ఘటన చోటు చేసుకుంది.
Soumitra Banerjee | పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఆ పార్టీ కీలక నేత కునాల్ ఘోష్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో టీఎంసీ నేతపై దాడి జరిగింది. సౌమిత్ర బెనర్జీ (Soumitra Banerjee)పై కొందరు కోడిగుడ్లతో దాడి చేశారు (attacked with eggs). బర్ధమాన్ జిల్లా రాణిగంజ్ నగరంలో (Raniganj city) ఈ ఘటన చోటు చేసుకుంది.
బీజేపీ నేత ఫిర్యాదు మేరకు అరెస్టైన సౌమిత్ర బెనర్జీని పోలీసులు కోర్టుకు తరలిస్తుండగా అక్కడున్న ఓ గుంపు "చోర్, చోర్, చోర్" (దొంగ, దొంగ, దొంగ) అంటూ ఆయనపై కోడిగుడ్లు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం సౌమిత్ర బెనర్జీని కోర్టుకు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారన్న ఆరోపణలతో ఆ పార్టీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సౌమిత్ర బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత కునాల్ ఘోష్ (Kunal Ghosh)పై ఒక స్థానిక యువకుడు కోడిగుడ్డు విసిరి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీదీతో సమావేశం ముగించుకొని బయటకు వస్తుండగా.. ఓ యువకుడు అకస్మాత్తుగా అతనిపై కోడిగుడ్డు విసిరాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో నేతపై కోడిగుడ్ల దాడి జరగడం గమనార్హం.
#WATCH | Raniganj, West Bengal | Trinamool youth leader Soumitra Banerjee attacked with eggs while being taken to court by police. Police brought the situation under control and safely escorted Banerjee to court.
Soumitra Banerjee was arrested based on a complaint by BJP leader… pic.twitter.com/xSJ1HvBwpY
— ANI (@ANI) June 16, 2026
Also Read..
వాహనదారులకు అలర్ట్.. ఈనెల 30 వరకే గడువు
వరుసగా మూడో సెషన్ కూడా లాభాల్లోనే.. దేశీయ సూచీల్లో కొనుగోళ్ల జోరు..
సంబంధిత వార్తలు

ED Freezes TMC Bank Accounts | తృణమూల్ కాంగ్రెస్‌కు ఈడీ బిగ్ షాక్.. రూ.440 కోట్ల ఖాతాలు ఫ్రీజ్, ఆ హెలికాప్టర్ కొనుగోళ్లే కొంపముంచాయా?
జులై 8, 2026

Encounter | 11 ఏళ్ల బాలికపై హత్యాచారం.. ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం
జులై 8, 2026

Rajya Sabha | బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
జులై 6, 2026
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



