త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fuel Pump Pole | క‌దులుతున్న కారుపై ప‌డిన భారీ స్తంభం.. ఎస్పీ నేత దుర్మ‌ర‌ణం

Fuel Pump Pole | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌తాప్‌గ‌ఢ్ (Pratapgarh) జిల్లా అంటు ప్రాంతంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పెట్రోల్ పంపు వ‌ద్ద అమ‌రుస్తున్న భారీ స్తంభం (Fuel Pump Pole) క‌దులుతున్న కారుపై ఒక్క‌సారిగా ప‌డింది.

G

National | Published On Feb 16, 2026, 10.56 am IST

Fuel Pump Pole | క‌దులుతున్న కారుపై ప‌డిన భారీ స్తంభం.. ఎస్పీ నేత దుర్మ‌ర‌ణం
Advertisement

Fuel Pump Pole | త్రినేత్ర‌.న్యూస్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌తాప్‌గ‌ఢ్ (Pratapgarh) జిల్లా అంటు ప్రాంతంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పెట్రోల్ పంపు వ‌ద్ద అమ‌రుస్తున్న భారీ స్తంభం (Fuel Pump Pole) క‌దులుతున్న కారుపై ఒక్క‌సారిగా ప‌డింది. దీంతో ఓ వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు.

స‌మాజ్‌వాదీ పార్టీ (SP) నేత లాల్ బ‌హ‌దూర్ యాద‌వ్ (Lal Bahadur Yadav) తన కారులో వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో బాబుగంజ్ మార్కెట్ స‌మీపంలోని ఒక పెట్రోల్ పంప్ (Fuel Pump) వ‌ద్ద కార్మికులు భారీ హై మాస్ట్ స్తంభాన్ని (High-mast Pole) ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప‌ట్టు త‌ప్ప‌డంతో అదే మార్గంలో వెళ్తున్న యాద‌వ్ కారుపై స్తంభం ఒక్క‌సారిగా ప‌డిపోయింది. సుమారు 1000 కిలోల బ‌రువును భారీ స్తంభం కారు ముందుభాగం, అందులోనూ డ్రైవ‌ర్ వైపే ప‌డ‌టంతో నుజ్జునుజ్జు అయింది. ఎయిర్ బెలూన్ తెరుచుకున్న‌ప్ప‌టికీ, అధిక‌ బ‌రువు కావ‌డంతో అది యాద‌వ్‌ను కాపాడ‌లేక‌పోయింది. కారు వెన‌కే ఒక బైకు, ఈ-రిక్షా కూడా వ‌స్తున్న‌ప్ప‌ట్టికీ, వారు స‌డ‌న్ బ్రేక్ వేయ‌డంతో క్షేమంగా బ‌య‌టప‌డ్డారు. ఇదంతా అక్క‌డే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ‌యింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాల్ వైర‌ల్ అవుతున్న‌ది. ఇండియ‌న్ రోడ్ల‌పై ఎవ‌రికీ ర‌క్ష‌ణ లేదంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, బ‌హ‌దూర్ యాద‌వ్‌ 2022లో అంటు నగర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయ నేతగానే కాకుండా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పీడబ్ల్యూడీ కాంట్రాక్టరుగా, మద్యం వ్యాపారిగా కూడా కొనసాగుతున్నారు. విష‌యం తెలుసుకున్న యాద‌వ్ కుటుంబ స‌భ్యులు, ఆయ‌న అభిమానులు పెట్రోల్ బంక్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. ఎలాంటి భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించ‌కుండా లైటింగ్ స్తంభం ఏర్పాటు చేయ‌డం, సిబ్బంది నిర్ల‌క్ష్యంతోనే వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

https://x.com/Benarasiyaa/status/2023000356985471410?s=20

Advertisement
Advertisement