త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dowry | క‌ట్నంగా రూ.71 ల‌క్ష‌ల న‌గ‌దు, 20 తులాల‌ బంగారం.. హాట్ టాపిక్‌గా యూట్యూబ‌ర్ పెళ్లి

Dowry | యూట్యూబ‌ర్ భారీగా క‌ట్నం తీసుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

D

National | Published On Feb 3, 2026, 12.16 pm IST

Dowry | క‌ట్నంగా రూ.71 ల‌క్ష‌ల న‌గ‌దు, 20 తులాల‌ బంగారం.. హాట్ టాపిక్‌గా యూట్యూబ‌ర్ పెళ్లి
Advertisement

Dowry | కట్నం (Dowry) ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ చట్టరీత్యా నేరం. అయినా ఇప్పటికీ కట్నం లేకుండా పెళ్లిళ్లు జరగడం లేదు. కానుకల రూపంలో భారీగానే తీసుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ‌ర్ భారీగా క‌ట్నం తీసుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అరుణ్ ప‌న్వ‌ర్ అనే యూట్యూబ‌ర్ (YouTuber Arun Panwar)కు 2.4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. కార్లు, బైక్‌లు వంటివాటిపై అత‌డు వీడియోలు చేస్తుంటాడు. యూట్యూబ్ ద్వారానే అత‌ను దాదాపు రూ.20 ల‌క్ష‌ల నుంచి రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కూ సంపాదిస్తున్నాడు. ఇక గ‌తేడాది అత‌డి వివాహం జ‌రిగింది. పెళ్లి స‌మ‌యంలో అత‌డు తీసుకున్న క‌ట్నం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. యూట్యూబ్ వీడియోల ద్వారా కంటే ఈ క‌ట్నం కార‌ణంగానే అత‌డు మ‌రింత ఫేమ‌స్ అవుతున్నాడు.

సూట్‌కేస్‌ నిండా నోట్ల క‌ట్ట‌లే..

పెళ్లి స‌మ‌యంలో అత్తింటి వారు అరుణ్‌కు ఏకంగా రూ.71 ల‌క్ష‌ల న‌గ‌దు, 21 తులాల బంగారాన్ని ముట్ట‌జెప్పారు. విచిత్రం ఏంటంటే.. వీటిని పెళ్లి మండ‌పంపైనే అంద‌రూ చూస్తుండ‌గానే అరుణ్‌కు అందించ‌డం. వ‌ధువు కుటుంబం పెళ్లి మండ‌పానికి ఓ పెద్ద సూట్‌కేస్ నిండా న‌గ‌దు తీసుకొచ్చింది. దాన్నంతా మండ‌పంపైనే ఓ పెద్ద ప్లేట్‌లో పెట్టి అరుణ్‌కు అందించారు. అక్క‌డే ఉన్న కొంద‌రు దీన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో అదికాస్తా వైర‌ల్‌గా మారింది.

నెటిజ‌న్లు ఫైర్‌

ఈ వీడియోపై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కాలంలో కూడా క‌ట్నం తీసుకోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఓ యూట్యూబ‌ర్‌కు ఇంత క‌ట్న‌మా..? అంటూ మ‌రికొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఇక అరుణ్‌ పన్వర్‌ పెళ్లి చేసుకున్న అమ్మాయి డాక్టర్‌ అని తెలుసుకున్న నెటిజ‌న్లు.. విద్యావంతులే కట్నం తీసుకోవడాన్ని ప్రోత్సహించడంపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

Advertisement
Advertisement