త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Man Tortures Wife | భార్య‌పై అనుమానం.. గుండు గీసి.. ముఖానికి మ‌సిపూసి మూత్రం తాగించాడు..

Man Tortures Wife | అనుమానం పెనుభూతం అంటారు. భార్య‌పై అనుమానం పెంచుకున్న భ‌ర్త.. క‌న్న బిడ్డ‌ల ముందే ఆమె కాళ్లూ చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. గుండు గీసి, ముఖానికి మసితోపాటు ఇంజిన్‌ ఆయిల్‌ పూసి.. బలవంతంగా మూత్రం (Drink Urine) తాగించాడు. ఈ పాశ‌విక ఘ‌ట‌న (Man Tortures Wife) ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) కొరియా జిల్లాలో చోటుచేసుకుంది.

G

National | Published On Jun 20, 2026, 8.51 am IST

Man Tortures Wife | భార్య‌పై అనుమానం.. గుండు గీసి.. ముఖానికి మ‌సిపూసి మూత్రం తాగించాడు..
Advertisement

Man Tortures Wife | త్రినేత్ర‌.న్యూస్‌: అనుమానం పెనుభూతం అంటారు. భార్య‌పై అనుమానం పెంచుకున్న భ‌ర్త.. క‌న్న బిడ్డ‌ల ముందే ఆమె కాళ్లూ చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. గుండు గీసి, ముఖానికి మసితోపాటు ఇంజిన్‌ ఆయిల్‌ పూసి.. బలవంతంగా మూత్రం (Drink Urine) తాగించాడు. ఈ పాశ‌విక ఘ‌ట‌న (Man Tortures Wife) ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) కొరియా జిల్లాలో చోటుచేసుకుంది.

తార‌, జితేంద్ర ఘ‌సియా దంప‌తులు 2006లో ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వారికి న‌లుగురు సంతానం. అయితే భార్య మీద అనుమానం పెంచుకున్న జితేంద్ర త‌ర‌చూ ఆమెను వేధిస్తున్నాడు. దీంతో గ‌త ఏడాది కాలంగా భ‌ర్త‌కు దూరంగా ఉంటున్న‌ది. ఇండ్ల‌లో డొమెస్టిక్ హెల్ప‌ర‌గా ప‌నిచేసుకుంటూ జీవినం సాగిస్తున్న‌ది. క‌ష్ట‌కాలంలో త‌న‌ను ఆదుకున్న వ్య‌క్తితో క‌లిసి ఉంటున్న‌ది. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన జితేంద్ర.. భార్యను ఇంటి నుంచి బయటకు లాగి గ్రామస్థులు అందరి ముందు అమానుషంగా ప్రవర్తించాడు. కాళ్లు చేతులు క‌ట్టేసి విచ‌క్ష‌ణ ర‌హితంగా కొట్టాడు. ఆమె మొహానికి మ‌సి పూశాడు. ఆమెకు గుండు గీసి.. ఇంజిన్ ఆయిల్ పోశాడు. బ‌ల‌వంతంగా మూత్రం తాగించేందుకు య‌త్నించాడు. బ‌తికుండ‌గానే కాల్చేస్తాన‌ని బెదిరించాడు. ఇదంతా క‌న్న బిడ్డ‌ల ముందే చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ అమానుష ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు న‌మోదుచేసిన పోలీసులు ఈ నెల 18న నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఆ వీడియోలో, నిందితుడు తన భార్య కుటుంబాన్ని వదిలిపెట్టి మరో వ్యక్తితో జీవిస్తోందని ఆరోపించడం వినబడుతున్న‌ది. ఆమె తన వద్దకు తిరిగి రాకముందు, తన బావమరిదితోనూ, ఆ తర్వాత మేనల్లుడితోనూ పారిపోయిందని ఆరోపించాడు. అయితే అత‌ని ఆరోప‌ణ‌ల‌ను బాధితురాలు ఖండించింది. గ‌తంలోనూ త‌న‌ను కొట్టాడ‌ని తార పోలీసుల‌కు తెలిపింది. మొద‌టి నుంచే త‌న‌ను అనుమానించేవార‌ని చెప్పింది. క‌ట్నం కోసం వేధించార‌ని పేర్కొంది. త‌న‌కు న్యాయం కావాల‌ని, నిందితుడిని శిక్షించాల‌ని డిమాండ్ చేసింది.

Advertisement
Advertisement