Allahabad High Court | ఐదు నెలలుగా భర్తతో సంబంధమే లేదు.. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది..?
Allahabad High Court | భార్య ఆత్మహత్య కేసులో భర్తను నిర్దోషిగా నిర్ధారిస్తూ అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఐదు నెలలుగా భర్తతో సంబంధమే లేదు.. కనీసం మాటలు కూడా లేవు.. అలాంటప్పుడు అతను ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుందని కోర్టు ప్రశ్నించింది.
Allahabad High Court | త్రినేత్ర.న్యూస్ : భార్య ఆత్మహత్య కేసులో భర్తను నిర్దోషిగా నిర్ధారిస్తూ అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఐదు నెలలుగా భర్తతో సంబంధమే లేదు.. కనీసం మాటలు కూడా లేవు.. అలాంటప్పుడు అతను ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుందని కోర్టు ప్రశ్నించింది.
కేసు వివరాలు ఇలా..
అంకుర్ టాండన్‌కు 2004 డిసెంబర్ 14న వివాహమైంది. అయితే ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు భర్త రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మృతురాలి తండ్రి తనకున్న ప్లాట్‌ను అమ్మి రూ. 6 లక్షలు అల్లుడికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరో రూ. 4 లక్షలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడని, దాంతో తన కుమార్తె 2010 అక్టోబర్ 2న ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఆరోపించాడు. ఈ కేసులో ట్రయల్ కోర్టు బాధితుడిని దోషిగా ప్రకటించింది.
హైకోర్టులో సవాల్
ట్రయల్ కోర్టు తీర్పును బాధితుడు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశాడు. ఆమె ఆత్మహత్యకు ముందు 5 నెలల 12 రోజుల పాటు భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధం లేదు.. మాటలు కూడా లేవు. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడుకున్నట్లు సాక్ష్యాలు లేవని అలహాబాద్ కోర్టు పేర్కొంది. ఈ విషయాలన్నింటినీ ట్రయల్ కోర్టు స్వయంగా నిర్ధారించింది. కాబట్టి ఈ కేసులో భర్త భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణ తప్పు అని కోర్టు స్పష్టం చేసింది. వరకట్నం తీసుకోవడమే కాకుండా, ఇవ్వడం కూడా సెక్షన్ 3 ప్రకారం నేరమని కోర్టు తేల్చిచెప్పింది. అయినప్పటికీ రూ. 6 లక్షలు ఇచ్చామని ఆరోపిస్తున్నప్పటికీ అందుకు తగిన ఆధారాలను కోర్టుకు చూపించలేకపోయారు. బలమైన ఆధారాలు లేనప్పుడు.. ఆత్మహత్యకు భర్త ప్రేరేపించినట్లు భావించలేమని కోర్టు అభిప్రాయపడింది.
తాజావార్తలు
- ●Surat textile market | సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు ధ్వంసం
- ●Addanki Dayakar | మేము అప్డేటెడ్ వర్షన్ దళితులం
- ●Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!
- ●Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థికి నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం
- ●BRS MLAs | పోలీసుల తీరుతో కన్నీరు పెట్టుకున్నా మమ్మల్ని కనీసం పట్టించుకోలే..
- ●Adani Enterprises | అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు భారీ పెట్టుబడి.. రూ.9,825 కోట్ల సమీకరణ..

Surat textile market | సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు ధ్వంసం

Addanki Dayakar | మేము అప్డేటెడ్ వర్షన్ దళితులం

Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!

Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థికి నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం






