CM Revanth Reddy | ప్రతిపక్షాలది శాడిస్టిక్ ప్లెజర్.. సభలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | 22ఏ భూముల విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష నేతలు శాడిస్టిక్ ప్లెజర్ పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : 22ఏ భూముల విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష నేతలు శాడిస్టిక్ ప్లెజర్ పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో 22ఏ భూములపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
22ఏ భూములపై రెవెన్యూ శాఖ మంత్రి సుదీర్ఘంగా ఆవేదనతో కూడుకున్న సమాచారాన్ని సభ ముందు పెట్టారు. ఆయనకు సంబంధం లేకపోయినా శాఖ నిర్వహిస్తున్నాడని, అవసరం ఉన్నా లేకపోయినా స్థాయి మరిచి అవగాహన రాహిత్యంలో ఆరోపణలు చేశారు. నాకు చార్మినార్ రాసిపెట్టు.. గోల్కొండ రాసిస్తే సెటిల్ అయిపోతా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రాసిస్తే నీటి సరఫరా చేసి యజమాని అవుతానని నా వద్దకు వస్తుంటారు. అందులో బంధువులు, స్నేహితులు, వ్యాపారస్తులు, ప్రతిపక్ష నేతలు ఉండొచ్చు. నేను అయితే నవ్వి కాసేపు, మీ లాంటోడు(స్పీకర్‌ను ఉద్దేశించి) అయితే ఐదారు గంటలు కూర్చోబెట్టి నొప్పి తెలియకుండా పంపిస్తారు అని సీఎం తెలిపారు.
కానీ ఆ మంత్రి గారు ముక్కుసూటి మనిషి. ముక్కసూటి తనంతో ఏదో ఒకటి అంటే సూటిపోటిగా అనిపించి మంత్రి మీద ప్రచారం చేసి.. పెద్ద భూతంగా తయారు చేశారు. పాతకాలంలో గోడల మీద ఓ స్త్రీ రేపు రా అని రాసేటోళ్లు.. అట్ల ఈ సమస్యను అంత జఠిలం చేసి నిషేధిత భూములు శ్రీనివాస్ రెడ్డి సృష్టించిన ఒక భూతము. ఈ భూతం అందర్నీ మింగేస్తుంది.. భూమ్మీద ఎవరు ఉండలేరన్నట్టుగా తయారు చేసి వదిలారు. దీన్నే శాడిస్టిక్ ప్లెజర్ అంటరు.. ఒక కక్షపూరితమైన ఆలోచనతో అబద్దాలతో కూడుకున్న ప్రచారాలు వ్యాప్తి చేశారు అని సీఎం అన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bandi Sanjay Karimnagar | కవులు, కళాకారుల పుట్టిల్లు కరీంనగర్
- ●Malavika Mohanan | మాళవికకు వరుస ఫ్లాపులు.. ఈ ఏడాది కలిసిరాని భారీ బడ్జెట్ సినిమాలు..!
- ●Saifabad Police Station Attack | సైఫాబాద్ పీఎస్లో దాడి నిజమే.. హైకోర్టులో అంగీకరించిన ప్రభుత్వం
- ●OPPO K14 Lite | 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కె14 లైట్.. ధర ఎంతంటే..
- ●Karimnagar Centralized Kitchen | కరీంనగర్లో అత్యాధునిక హంగులతో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం.. విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం!
- ●Karnataka MLAs niece | పీజీ చదువుతూనే వైద్యురాలిగా ప్రభుత్వ ఉద్యోగం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలిపై వేటు

Bandi Sanjay Karimnagar | కవులు, కళాకారుల పుట్టిల్లు కరీంనగర్

Malavika Mohanan | మాళవికకు వరుస ఫ్లాపులు.. ఈ ఏడాది కలిసిరాని భారీ బడ్జెట్ సినిమాలు..!

Saifabad Police Station Attack | సైఫాబాద్ పీఎస్లో దాడి నిజమే.. హైకోర్టులో అంగీకరించిన ప్రభుత్వం

OPPO K14 Lite | 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కె14 లైట్.. ధర ఎంతంటే..






