Digangana | బాలీవుడ్ సినిమాకు రైటర్‌గా టాలీవుడ్ హీరోయిన్ – డైరెక్టర్‌గా పుష్ప కొరియోగ్రాఫర్
బాలీవుడ్ హీరోయిన్ దిగంగనా సూర్యవన్షీ రైటర్‌గా మారింది. బాలీవుడ్ మూవీ గణేష్‌కు స్క్రీన్‌ప్లే డైలాగ్స్ అందివ్వబోతుంది. తెలుగులో హిప్పీ, సీటీమార్, క్రేజీ ఫెల్లోతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On Sep 15, 2026, 2.40 pm IST
Digangana | టాలీవుడ్ హీరోయిన్ దిగంగనా సూర్యవన్షీ రచయితగా మారింది. బాలీవుడ్ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించబోతుంది. కార్తికేయ హీరోగా నటించిన హిప్పీ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వలయం, సీటీమార్, క్రేజీ ఫెల్లో, శివంభజే సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. వీటిలో గ్లామర్‌తో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాలేకపోయిన ఈ బ్యూటీ కొత్త జర్నీ మొదలుపెట్టబోతుంది.
స్టార్ కొరియోగ్రాఫర్...
బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దర్శకత్వంలో ఓ బాలీవుడ్ మూవీ రాబోతుంది. గణేష్ డస్ట్ టూ స్టార్‌డస్ట్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీని సోమవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. మురికివాడలో పుట్టిన ఓ యువకుడు గొప్ప డ్యాన్సర్‌గా ఎలా ఫేమస్ అయ్యాడనే కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. సౌందర్య నిర్మిస్తోంది.
స్క్రీన్‌ప్లే...డైలాగ్స్...
గణేష్ మూవీకి హీరోయిన్ దిగంగనా సూర్యవన్షీ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించబోతుంది. రైటర్‌గా ఈ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వబోతుంది. కథానాయికగా అంతగా అవకాశాలు రాకపోవడంతోనే ఈ బ్యూటీ రైటర్‌గా మారినట్లు ప్రచారం జరుగుతోంది.
బిగ్‌బాస్‌లో...
సినిమాల్లోకి రాకముందు వేవ్స్, నిక్సైన్ ది మెర్మైడ్ అంద్ ది పవర్ ఆఫ్ లవ్ అనే బుక్స్ రాసింది. బిగ్‌బాస్ హిందీ సీజన్ 9లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది. 57 రోజుల పాటు హౌజ్‌లో కొనసాగింది. శకుంతల, కృష్ణ అర్జున్, ఎక్ వీర్ కీ అర్దాస్ వీర అనే సీరియల్స్‌లో నటించింది. బాలీవుడ్‌లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకున్న గణేష్ ఆచార్య తెలుగులో పుష్ప, డీజే దువ్వాడ జగన్నాథమ్, దేవర సినిమాలో డ్యాన్స్ కంపోజ్ చేశాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Deepika Padukone | దీపికా పడుకోణ్‌తో సినిమా – నా కెరీర్లో చేసిన పెద్ద తప్పు – బాలీవుడ్ హీరో కామెంట్స్
సెప్టెంబర్ 11, 2026

Tripti Dimri | అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాత్రలో తిప్తి డిమ్రి – వెండితెరపైకి ట్రాజెడీ లవ్‌స్టోరీ
సెప్టెంబర్ 11, 2026

Kareena Kapoor | దిశా ఎన్‌కౌంటర్‌పై కరీనా కపూర్ బాలీవుడ్ మూవీ – సజ్జనార్ పాత్రలో మలయాళ స్టార్ హీరో
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Madhavaram Krishna Rao | నన్ను అసెంబ్లీకి రానివ్వండి.. 22ఏ పై అన్ని ఆధారాలతో మాట్లాడతా
- ●Alla Nani | ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
- ●Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్ భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.65..
- ●US Space Force | అంతరిక్షంలోనూ మా ఆయుధాలు ఉన్నాయ్.. అమెరికా బహిరంగ ప్రకటన
- ●Revanth meets Prince Rahim Aga khan-V | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను కోరిన సీఎం రేవంత్
- ●Samsung Galaxy S26 FE | గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్..

Madhavaram Krishna Rao | నన్ను అసెంబ్లీకి రానివ్వండి.. 22ఏ పై అన్ని ఆధారాలతో మాట్లాడతా

Alla Nani | ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్ భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.65..

US Space Force | అంతరిక్షంలోనూ మా ఆయుధాలు ఉన్నాయ్.. అమెరికా బహిరంగ ప్రకటన



