త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్‌ భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.65..

Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్‌ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ షేర్‌హోల్డర్లకు భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.65 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించనున్నట్లు మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజ్ లో దాఖలు చేసిన ప్రకటనలో తెలిపింది. 2027 మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి ఒక్కో రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుపై రూ.65 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది.

S

Business | Published On Sep 15, 2026, 1.59 pm IST

Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్‌ భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.65..
Advertisement

Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్‌ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ షేర్‌హోల్డర్లకు భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.65 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించనున్నట్లు మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజ్ లో దాఖలు చేసిన ప్రకటనలో తెలిపింది. 2027 మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి ఒక్కో రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుపై రూ.65 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది. అంటే ముఖ విలువపై 650 శాతం డివిడెండ్‌ అందనుంది. మంగ‌ళ‌వారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

తేదీ ఎప్పుడు..

డివిడెండ్‌ పొందేందుకు అర్హత నిర్ణయించే రికార్డు తేదీని సెప్టెంబర్‌ 21గా కంపెనీ ఖరారు చేసింది. అయితే భారత్‌లో అమల్లో ఉన్న టి+1 సెటిల్‌మెంట్‌ విధానం ప్రకారం రికార్డు తేదీ రోజున షేర్లు కొనుగోలు చేసిన వారికి ఈ డివిడెండ్‌ లభించదు. డివిడెండ్‌ కోసం అర్హతను నిర్ణయించే రికార్డు తేదీకి ముందు ఎక్స్‌-డివిడెండ్‌ తేదీ ఉంటుంది. ఈ తేదీ నుంచి షేరు ధరలో రాబోయే డివిడెండ్‌ను ప్రతిబింబించేలా సర్దుబాటు జరుగుతుంది. అందువల్ల డివిడెండ్‌ పొందాలని భావించే పెట్టుబడిదారులు రికార్డు తేదీతోపాటు ఎక్స్‌-డివిడెండ్‌ తేదీని కూడా గమనించాల్సి ఉంటుంది. రికార్డు తేదీ నాటికి అర్హత కలిగిన షేర్‌హోల్డర్లకు మధ్యంతర డివిడెండ్‌ను అక్టోబర్‌ 13లోగా జమ చేస్తామని బజాజ్‌ హోల్డింగ్స్‌ తెలిపింది.

Advertisement
Advertisement