త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhavaram Krishna Rao | నన్ను అసెంబ్లీకి రానివ్వండి.. 22ఏ పై అన్ని ఆధారాలతో మాట్లాడ‌తా

Madhavaram Krishna Rao | త‌న‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేసి అసెంబ్లీకి రానివ్వాల‌ని.. స‌భ‌లో 22ఏ పై అన్ని ఆధారాలతో వివ‌రిస్తాన‌ని కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు అన్నారు.

S

Telangana | Published On Sep 15, 2026, 2.44 pm IST

Madhavaram Krishna Rao | నన్ను అసెంబ్లీకి రానివ్వండి.. 22ఏ పై అన్ని ఆధారాలతో మాట్లాడ‌తా
Advertisement
  • పొంగులేటి ఆయ‌న‌కు అనుకూలంగా ఉన్న‌వే మాట్లాడిండు
  • నేను చెప్పేది అబద్ద‌మైతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా
  • మీడియా స‌మావేశంలో ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు వ్యాఖ్య‌లు

Madhavaram Krishna Rao | త్రినేత్ర‌.న్యూస్‌: త‌న‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేసి అసెంబ్లీకి రానివ్వాల‌ని.. స‌భ‌లో 22ఏ పై అన్ని ఆధారాలతో వివ‌రిస్తాన‌ని కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు అన్నారు. అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి త‌న‌ గురించి, మాజీ మంత్రి హరీష్ రావు, జయప్రకాష్ నారాయణ గురించి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పొంగులేటికి అనుకూలంగా ఉన్నవే మాట్లాడార‌ని మండిప‌డ్డారు. తాను చెప్పేవి అబ్బద్ధాలైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాన‌ని వ్యాఖ్యానించారు. సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈమేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ పొంగులేటిపై ఫైర‌య్యారు.

కావాలంటే నేను పంపిస్తా..

నేను 22ఏ లో భూములు పెట్టిన మూడో నెల నుంచే దీనిపై మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రి, మంత్రికి కూడా దీనిపై ఫిర్యాదు చేశాను. హరీష్ రావు అంటే ఎందుకు అంత భయం. 60 సంవత్సరాల నుంచి నివసిస్తున్న వారిని ల్యాండ్ కబ్జాదారులు అంటున్నారని జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. అవన్నీ ఆధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి.. కావాలంటే నేను పంపిస్తాను.

కోర్టు కూడా చెప్పింది..

ప్రభుత్వం పరంగా లేవఅవుట్ అయ్యాయి, 60 సంవత్సరాల కాలం నుండి ఇక్కడే ఉంటున్నారు. అప్పటినుంచి అన్ని రిజిస్ట్రేషన్‌లు అవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అన్ని రిజిస్ట్రేషన్‌లు అయ్యాయి. ఈ ప్రభుత్వం వచ్చాక వన్ ఇయర్ వరకు కూడా రిజిస్ట్రేషన్‌లు అయ్యాయి. తర్వాత ఆగిపోయాయి. దానిపై నేను కలెక్టర్‌ను, సంబంధిత అధికారులను కలిశాను. కానీ అవన్నీ అలానే ఉన్నాయి. కోర్టుకు వెళ్తే కూడా రిజిస్ట్రేషన్ చేయండి అని అన్నారు.

కానీ మంత్రి అప్పటి నుంచే అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? నిన్న పొలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఆర్వో, పీఏపై దాడికి యత్నించారు. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. 22ఏ పై సిట్టింగ్ జడ్జీ తో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి, మంత్రిని డిమాండ్ చేస్తున్న. తెలంగాణ ఉద్యమం సమయంలో సైతం కేసీఆర్ చనిపోవాలని వారు కోరలేదు. కేవలం రాష్ట్రం విడిపోవద్దు అన్నారు అని కృష్ణారావు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement