త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IT Rraid | ఎన్నిక‌ల వేళ‌ టీఎంసీకి షాక్‌.. ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు..!

IT Rraid | ప‌శ్చిమ బెంగాల్‌లో త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. రెండు విడుత‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. పోలింగ్‌కు ముందు తృణ‌మూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దేబాశిష్ కుమార్ నివాసంపై ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వ‌హించింది.

P

National | Published On Apr 17, 2026, 1.16 pm IST

IT Rraid | ఎన్నిక‌ల వేళ‌ టీఎంసీకి షాక్‌.. ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు..!
Advertisement

IT Rraid | ప‌శ్చిమ బెంగాల్‌లో త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. రెండు విడుత‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. పోలింగ్‌కు ముందు తృణ‌మూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దేబాశిష్ కుమార్ నివాసంపై ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వ‌హించింది. దాంతో బెంగాల్‌లో రాజ‌కీయాలు వేడెక్కాయి. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో దక్షిణ కోల్‌కతాలోని మనోహర్‌పుకూర్ రోడ్డులో ఉన్న ఆయన ఇంటిపైనా, ఎన్నికల కార్యాలయంపై ఆదాయపు పన్ను బృందం ఏకకాలంలో దాడులు చేప‌ట్టింది. దాడుల‌కు కార‌ణాలు మాత్రం తెలియ‌రాలేదు. భూ కుంభకోణానికి సంబంధించి టీఎంసీ ఎమ్మెల్యే దేబాశిష్ కుమార్ ఈడీ నిఘాలో ఉన్నట్లు సమాచారం. ఆయనను పలుమార్లు విచారణకు పిలిచింది.

దాంతో ఆయ‌న ఈడీ ఎదుట హాజ‌ర‌య్యారు. వ్యాపారవేత్త అమిత్ గంగోపాధ్యాయతో ఆయనకు ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? అని తెలుసుకునేందుకు ద‌ర్యాప్తు సంస్థ‌లు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దేబాశిష్ కుమార్ రాష్‌బెహ‌రి అసెంబ్లీ స్థానం నుంచి టీఎంసీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏప్రిల్ 29న పోలింగ్ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఐటీ దాడులు జ‌రుగ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ స్థానం నుంచి బీజేపీ సీనియ‌ర్ రాజకీయ విశ్లేషకుడు స్వపన్ దాస్‌గుప్తాను బ‌రిలోకి దింపింది. ఐటీ దాడుల నేప‌థ్యంలో టీఎంసీ మ‌ద్ద‌తుదారులు గంద‌ర‌గోళం సృష్టించారు. దేబాశిష్ కుమార్ ఇంటి ఎదుట టీఎంసీ కార్యకర్తలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు.

Advertisement
Advertisement