త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Foreigners’ Registration | ఆ ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్‌..!

Foreigners’ Registration | హైదరాబాద్ నగర పరిధిలో విదేశీ పౌరుల నివాసం, విద్యార్థుల చేరికలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా ప్రభుత్వానికి సమర్పించాలని జూబ్లీహిల్స్ జోన్ పోలీసులు స్పష్టం చేశారు. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025, అలాగే ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ రూల్స్ 2025 ప్రకారం ఈ నిబంధనలు కఠినంగా అమల్లో ఉంటాయని వెల్లడించారు.

P

Telangana | Published On Jun 3, 2026, 9.45 pm IST

Foreigners’ Registration | ఆ ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్‌..!
Advertisement

Foreigners’ Registration | హైదరాబాద్ నగర పరిధిలో విదేశీ పౌరుల నివాసం, విద్యార్థుల చేరికలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా ప్రభుత్వానికి సమర్పించాలని జూబ్లీహిల్స్ జోన్ పోలీసులు స్పష్టం చేశారు. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025, అలాగే ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ రూల్స్ 2025 ప్రకారం ఈ నిబంధనలు కఠినంగా అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నగరంలోని గృహ యజమానులు, హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు, హోమ్‌స్టేలు, విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, కళాశాలలు, ఆసుపత్రులు తదితర వసతి సదుపాయాలు కల్పించే అన్ని సంస్థలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

నిబంధనల ప్రకారం.. వసతి ప్రదాతలు తమ వద్దకు వచ్చే ప్రతి విదేశీ పౌరుడి వివరాలను ఫారమ్–3 (ఫారమ్–సీ) ద్వారా ఆన్‌లైన్‌లో 24 గంటల్లోగా స‌మ‌ర్పించాలి. విదేశీ పాస్‌పోర్ట్ హోల్డర్లు, వోసీఐ కార్డ్ హోల్డర్లు, నేపాల్ పౌరులు సహా అన్ని విదేశీయుల వివరాలు ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా వారు ప్రాంగణం విడిచే సమయంలో డిపార్చర్ వివరాలు కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పనిసరి. విద్యాసంస్థల విషయానికి వస్తే, విదేశీ విద్యార్థుల అడ్మిషన్, ఎన్రోల్మెంట్, రాకపోకలు, కోర్సు మధ్యలో నిలిపివేత వంటి వివరాలను ఫారమ్–2 ద్వారా సమర్పించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని స్పష్టం చేశారు.

సమాచారాన్ని ఇవ్వ‌డంలో విఫ‌ల‌మైనా, త‌ప్పుడు వివ‌రాలు అందించినా చట్టంలోని సెక్షన్ 23 సహా సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అవసరమైన రికార్డులను కనీసం ఒక సంవత్సరం పాటు భద్రపరచడం కూడా తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనగా పేర్కొన్నారు. ఈ నిబంధనలను జూబ్లీహిల్స్ జోన్ పరిధిలోని అన్ని పోలీస్ అధికారులు కఠినంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. చట్టపరమైన ఉల్లంఘనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement