DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
DK Shivakumar | కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీకే శివకుమార్ తొలి మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. అభివృద్ధి, ఉపాధి కల్పన, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
DK Shivakumar | కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీకే శివకుమార్ తొలి మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. అభివృద్ధి, ఉపాధి కల్పన, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పదవి తన వ్యక్తిగతం కాదని, అది ప్రజల బాధ్యత అని వ్యాఖ్యానించిన శివకుమార్.. ప్రభుత్వం పూర్తిగా బాధ్యతతో పనిచేస్తుందని చెప్పారు.
విద్యార్థులు, యువతకు కీలక హామీలు
రాష్ట్రంలోని అన్ని విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. విద్య ఖర్చులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. అలాగే ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేకంగా ‘ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్’ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవస్థ రూపకల్పన నెల రోజుల్లో పూర్తవుతుందని పేర్కొన్నారు. గ్రామాల నుంచి రైతులు వలస వెళ్లకుండా ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని సీఎం తెలిపారు. ఉపాధి సమస్యలు, వ్యవసాయ ఇబ్బందుల కారణంగా జరుగుతున్న వలసలను తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
యువత కోసం ‘భారత్ జోడో యువ సంఘాలు’
ప్రతి గ్రామ పంచాయతీలో ‘భారత్ జోడో యువ సంఘం’కు రూ.10 లక్షల నిధులు అందించనున్నట్లు శివకుమార్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల యువ సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యువతలో నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించడం, సామాజిక ఐక్యతను బలోపేతం చేయడం వీటి లక్ష్యమని వివరించారు. ప్రజాస్వామ్యంలోని నాలుగు వ్యవస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి తుషార్ గిరి నాథ్‌ను ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు పట్టణాభివృద్ధి శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. రాజేంద్ర చోళన్ పీకి ముఖ్యమంత్రి కార్యదర్శిగా, కర్ణాటక పవర్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు ఇచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అతీక్ ఎల్‌కేకు ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారుగా నియామకం జరిగింది. ఆయన బెంగళూరు బిజినెస్ కారిడార్ చైర్మన్‌గా కొనసాగనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!
- ●Accident | అమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ సతీమణి సుచియాష్కీకి గాయాలు
- ●KTR | ఓటర్ల జాబితా వడపోతపై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
- ●KTR | హరీశ్‌రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు

Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Accident | అమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ సతీమణి సుచియాష్కీకి గాయాలు



