Peddi Review | పెద్ది రివ్యూ – రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది – జాన్వీ కపూర్ మైనస్!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ పెద్ది జూన్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Entertainment | Published On Jun 4, 2026, 2.53 am IST
Peddi Review | సంక్రాంతి తర్వాత టాలీవుడ్‌కు సరైన హిట్టు లేదు. సమ్మర్‌లో విజయాలు లేక థియేటర్లు మొత్తం వెళవెళబోయయాయి. రామ్‌చరణ్ పెద్దితో మళ్లీ బాక్సాఫీస్‌కు కళ రావడం ఖాయమని ఫ్యాన్స్ ఎదురుచూశారు. అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల నిరీక్షణకు తెరదించుతూ పెద్ది గురువారం థియేటర్లలోకి వచ్చింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. పెద్ది ఎలా ఉంది? ఈ సినిమాతో రామ్‌చరణ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అంటే?
పెద్ది...క్రికెటర్...రెజ్లర్...
విజయనగరానికి సమీపంలో ఉన్న కొండ కింద ఓ ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఎవరికి ఓటు హక్కు ఉండదు. జనాభా లెక్కల్లో వారి పేర్లు కనిపించవు. ఆ ఊరికి వెళ్లాలంటే కొండలు, వాగులు దాటాల్సిందే. ఆ ఊరికి చెందిన పెద్ది (రామ్‌చరణ్) బెల్లం బట్టీలో కూలీగా పనిచేస్తుంటాడు. గొప్ప క్రికెటర్. ఏ ఊరివాళ్లు తనను డబ్బులిచ్చి వేలంలో కొనుక్కుంటే ఆ ఊరికే క్రికెట్ ఆడతాడు. కొండకింది ఊరికి రైల్వే స్టేషన్ కావాలని అప్పలసూరి(జగపతిబాబు) 30 ఏళ్లుగా పోరాటం చేస్తుంటాడు. ఓ ప్రమాదంలో అప్పలసూరి చనిపోతాడు. అతడి మరణం పెద్దిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? తనకు ఇష్టమైన క్రికెట్‌ను వదిలి రెజ్లింగ్‌ను ఎందుకు నేర్చుకున్నాడు? రెజ్లింగ్‌లో నేషనల్స్ వరకు వెళ్లిన పెద్ది ఫైనల్‌లో ఎలా అన్‌ఫిట్ అయ్యాడు? తన ఊరి కోసం ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు? పెద్దికి అండగా నిలిచిన గౌర్నాయుడు(శివరాజ్‌కుమార్) ఎవరు? పెద్దిని ప్రేమించిన అచ్చియమ్మ (జాన్వీ కపూర్) అతడిని పెళ్లి చేసుకుందా? లేదా? అన్నదే మిగిలిన కథ.
వయలెక్షన్స్, యాక్షన్ సినిమాలు...
పాన్ ఇండియన్ కల్చర్ మొదలైన తర్వాత స్టార్ హీరోలంతా లార్జర్‌దేన్ లైఫ్ స్టోరీలకే ప్రాధాన్యమిస్తున్నారు. హీరోయిజం, ఎలివేషన్లు, వయలెన్స్ తో కూడిన యాక్షన్ కథల్లోనే కనిపించడానికి ఇష్టపడుతున్నారు. ఏదైనా ఓ లెవల్ వరకు బాగానే ఉంటుంది. లిమిట్ దాటితేనే ప్రమాదం. ఈ హీరోయిజం కథలు కూడా ఎక్కువపోవడంతో ఆడియెన్స్ ఈ మధ్య వీటిని పట్టించుకోవడం లేదు. దాంతో హీరోలు తమ పంథాను మారుస్తున్నారు.
పెద్దితో రామ్‌చరణ్ అదే ప్రయత్నం చేశారు. తనకున్న మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీని చేశాడు. ప్రపంచం ఎప్పుడూ గెలిచిన వాడి మాటే వింటుంది. తన గెలుపుతో పుట్టిన ఊరిని కష్టాల నుంచి గట్టెక్కించాలని, తన జాతికి గుర్తింపు తీసుకురావాలని పోరాటం చేసిన ఓ ఆటగాడి కథతో ఈ మూవీని తెరకెక్కించారు బుచ్చిబాబు సానా.
మూడు ఆటలు...
సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలు ఒకే ఆట చుట్టూ తిరుగుతుంటాయి. కానీ పెద్ది మాత్రం అందుకు భిన్నంగా సాగుతుంది. ఇందులో క్రికెట్, రెజ్లింగ్, రన్నింగ్‌ను చూపించారు. క్రాస్ ఓవర్ అథ్లెట్ అనే కొత్త పాయింట్‌ను టచ్ చేశాడు. చరణ్ క్రికెట్ ఆడే సీన్లు, రింగ్‌లో రెజ్లర్లతో తలపడే సన్నివేశాలు ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్‌లా నిలుస్తాయి.
లాజిక్‌లెస్...
ఆటల వరకు సినిమా ఒకే. కానీ హీరో తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాడన్నది మాత్రం కన్వీన్సింగ్‌గా చెప్పలేకపోయాడు. ఓ గేమ్ నుంచి మరో గేమ్‌కు హీరో మారడం, ఈజీగా నేషనల్స్ ఆడటం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. తన ఊరి కోసం హీరో ఢిల్లీలో మినిస్టర్లను కలిసే సీన్లు చాలా సినిమాటిక్‌గా అనిపిస్తాయి.
క్లైమాక్స్ మాత్రం బాగుంది. పతాక ఘట్టాలనే దర్శకుడు ఎక్కువగా నమ్ముకున్నారు. ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు.
డబుల్ మీనింగ్...
లవ్ ట్రాక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్‌గా మారింది. జాన్వీ పాత్రను కేవలం గ్లామర్ కోసమే సినిమాలో ఇరికించారు. ఆమె పాత్ర నేపథ్యంలో వచ్చే డైలాగ్స్‌లో డబుల్ మీనింగ్‌లో ఎక్కువయ్యాయి. పెద్ది జర్నీకి ఉపయోగపడే క్యారెక్టర్ కాదు. జాన్వీ సీన్లు మొత్తం లేపేసిన సినిమాకు ఎలాంటి నష్టం ఉండదు. సినిమాలో సిల్లీ సీన్లు చాలానే ఉన్నాయి. పెద్ది నేషనల్ లెవెల్‌లో మెడల్స్ సాధించినా ఒలింపిక్ కమిటీ మెంబర్‌కు అతడు ఎవరన్నది తెలియకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది.
రామ్‌చరణ్ జీవించాడు...
పెద్ది పాత్రలో రామ్ చరణ్ జీవించాడు. రెజ్లర్‌గా, క్రికెటర్‌గా ట్రాన్స్‌ఫర్మ్ అయిన తీరు, ఈ సీన్ల కోసం అతడు పడిన కష్టం మెప్పిస్తుంది. బుచ్చిబాబు కథను తన నటనతో నిలబెట్టాడు. డ్యాన్సులు, యాక్షన్ సీన్లు, ఎమోషన్స్‌తో మెప్పించాడు. అప్పలసూరిగా జగపతిబాబు, గౌర్నాయుడుగా శివరాజ్‌కుమార్ తమ అనుభవంతో పాత్రల్లో ఒదిగిపోయారు. హీరోయిన్‌గా జాన్వీకపూర్, స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్ పూర్తిగా తేలిపోయారు. దివ్యేందు శర్మ, తారక్ పొన్నప్ప విలనిజం అంతగా వర్కవుట్ కాలేదు. సత్య, చమ్మక్ చంద్రతో పాటు మరికొందరు కమెడియన్లు ఉన్న వారిని సరిగ్గా వాడుకోలేదు డైరెక్టర్.
స్టార్ హీరోతో సినిమా అంటే కమర్షియల్ కథలతో చాలా మంది దర్శకులు సేఫ్ గేమ్ ఆడుతారు. కానీ బుచ్చిబాబు మాత్రం డిఫరెంట్ స్టోరీతో పెద్దిని తెరకెక్కించారు. డైరెక్టర్‌గానే కాకుండా రైటర్‌గా మెప్పించాడు. ఏఆర్ రెహమాన్ పాటల్లో చికిరి సాంగ్‌తో పాటు పిక్చరైజేషన్ బాగుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది.
మెగా ఫ్యాన్స్‌కు మాత్రమే...
పెద్ది మెగా ఫ్యాన్స్‌ను మాత్రమే మెప్పించే స్పోర్ట్స్ డ్రామా మూవీ. కథ కంటే రామ్‌చరణ్ ఇమేజ్, యాక్టింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడి బుచ్చిబాబు సానా ఈ సినిమాను రూపొందించారు.
రేటింగ్ : 2/5
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!
- ●Accident | అమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ సతీమణి సుచియాష్కీకి గాయాలు

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!

Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు






