Saumitra Khan | కమలంపార్టీలోకి 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు..? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Saumitra Khan | తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress ) పార్టీకి చెందిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు (Trinamool MLAs), 20 మంది ఎంపీలు బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఎంపీ సౌమిత్ర ఖాన్ (Saumitra Khan) చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Saumitra Khan | బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ (Saumitra Khan) సంచలన ప్రకటన చేశారు. మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress ) పార్టీకి చెందిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు (Trinamool MLAs), 20 మంది ఎంపీలు బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారంతా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. బీజేపీ కేంద్ర నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే వారంతా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు రెఢీగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే జరిగితే తృణమూల్ కాంగ్రెస్ ఒక రాజకీయ శక్తిగా తన ఉనికినే కోల్పోతుందని వ్యాఖ్యానించారు.
“బీజేపీ కేంద్ర నాయకత్వం ఓకే చెబితే.. టీఎంసీ అసలు ఒక రాజకీయ పార్టీగానే మిగలదు. ఆ పార్టీలోని నేతలంతా దీదీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు. వారంతా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు.
పాపులు జైలుకెళ్లక తప్పదు..
ఇదే సమయంలో తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై సౌమిత్ర ఖన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనను ఒక 'పాపి'గా అభివర్ణిస్తూ, పాపం చేసిన వారు జైలుకు వెళ్లక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన ఇంటి ముందు బుల్డోజర్ సిద్ధంగా ఉందని అన్నారు. 2021లో ఆయన బీజేపీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేయించినందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఘాటుగా విమర్శించారు. “పాపులు తమ పాపాలకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. వారు నరకానికి పోతారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సంబంధిత వార్తలు

Annamalai | నేరగాళ్లకు స్వేచ్ఛ లభించింది.. సెలబ్రేషన్ మూడ్ నుంచి బయటకు రండి.. విజయ్‌పై అన్నామలై ధ్వజం
మే 26, 2026

Maach Bhaat Scheme | కేవలం రూ.5 కే రుచికరమైన ‘చేపల భోజనం’.. పేదల కోసం సీఎం బంపరాఫర్
మే 26, 2026

Ratna Debnath | నేను బిడ్డను కోల్పోయా.. మమత కుర్చీని కోల్పోయింది : ఆర్జీకార్ మృతురాలి తల్లి
మే 26, 2026
తాజావార్తలు
- ●Air india Plane Crash | విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్.. రూ.105 కోట్లతో పునర్నిర్మాణం
- ●iPhone | ఐఫోన్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం.. చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కున్నా ఇట్టే పసిగడుతుంది..
- ●Prof Nageshwar | అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు : మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్
- ●Ebola | ఆ మహిళకు ఎబోలా లేదు : కర్ణాటక ఆరోగ్య మంత్రి
- ●ED Vehicle Attacked Kerala | కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం శ్రేణుల దాడి.. పినరయి విజయన్ నివాసాల్లో సోదాలతో తీవ్ర ఉద్రిక్తత
- ●Stock Markets | సెన్సెక్స్ వరుసగా రెండో రోజు డౌన్.. మిడ్‌క్యాప్స్ దుమ్మురేపాయి..

Air india Plane Crash | విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్.. రూ.105 కోట్లతో పునర్నిర్మాణం

iPhone | ఐఫోన్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం.. చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కున్నా ఇట్టే పసిగడుతుంది..

Prof Nageshwar | అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు : మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్

Ebola | ఆ మహిళకు ఎబోలా లేదు : కర్ణాటక ఆరోగ్య మంత్రి



