త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Texas Indian Flag Torn | టెక్సాస్‌లో దారుణం: భారత జాతీయ జెండా చించివేత.. నెట్టింట భగ్గుమంటున్న భారతీయులు

అమెరికాలోని టెక్సాస్‌లో ఒక వ్యక్తి భారత జాతీయ జెండాను చించేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. భారతీయుల వలసలపై కోపంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. వీడియో వైరల్!

J

International | Published On Jun 3, 2026, 1.39 pm IST

Texas Indian Flag Torn | టెక్సాస్‌లో దారుణం: భారత జాతీయ జెండా చించివేత.. నెట్టింట భగ్గుమంటున్న భారతీయులు
Advertisement
  • అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో సిటీ హాల్ వద్ద ఒక వ్యక్తి భారత జాతీయ జెండాను చించేశాడు.
  • డల్లాస్ ప్రాంతంలో భారతీయుల వలసలు పెరిగిపోతున్నాయనే కోపంతో క్లేటన్ వాకర్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
  • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు.
  • ద్వేషంతో ఒక దేశ జాతీయ జెండాను అవమానించడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Texas Indian Flag Torn | త్రినేత్ర.న్యూస్ : అమెరికాలో (USA) భారతీయులపై ద్వేషం మరోసారి బయటపడింది. టెక్సాస్ (Texas) రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ (Frisco City hall) వద్ద ఒక వ్యక్తి బహిరంగంగా భారత జాతీయ జెండాను ముక్కలు ముక్కలుగా చించేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికాలోకి భారతీయుల వలసలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ అకృత్యానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలేం జరిగింది?

స్థానిక నివేదికల ప్రకారం.. టెక్సాస్‌కు చెందిన క్లేటన్ వాకర్ (Clayton Walker) అనే వ్యక్తి నోట్లో సిగరెట్ పెట్టుకుని, అందరూ చూస్తుండగానే భారత జాతీయ జెండాను చించేశాడు. నార్త్ డల్లాస్ (North Dallas) ప్రాంతంలో భారతీయుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటాన్ని నిరసిస్తూ అతడు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.

చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు అతడిని ఆపే ప్రయత్నం చేయకపోగా, ఎంకరేజ్ చేయడం గమనార్హం. ఇండియాకు వ్యతిరేకంగా అభ్యంతరకర పదజాలంతో నినాదాలు చేయడం ఈ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.

క్షణాల్లో వైరల్ (Viral)

ఎలైజా షాఫర్ (@ElijahSchaffer) అనే యూజర్ ఈ వీడియోను 'ఎక్స్' వేదికగా షేర్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ ఘటనపై ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, జాతీయ జెండాను అవమానించడంపై ప్రవాస భారతీయులు (NRIs) మండిపడుతున్నారు.

చురకలు అంటిస్తున్న నెటిజన్లు

సోషల్ మీడియా యూజర్లు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఒక నెటిజన్ స్పందిస్తూ.. "ఒక జెండాను అవమానించినంత మాత్రాన ఆ దేశం విలువ తగ్గిపోదు. రోజూ ఎంతో కష్టపడి పనిచేస్తూ తమ వంతు సహకారం అందిస్తున్న లక్షలాది మంది వల్లే దేశ గొప్పదనం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి విద్వేష పూరిత చర్యల కంటే ఇండియా స్థాయి చాలా పెద్దది" అని కామెంట్ చేశారు.

"అతనిలో ఫ్రస్ట్రేషన్ (Frustration) ఉండొచ్చు, కానీ జెండా చించేస్తే మీ ప్రభుత్వ విధానాలు మారిపోవు. హెచ్-1బీ (H-1B) వీసాలపై ఉన్న భారతీయులు చట్టబద్ధంగానే అమెరికాలో ఉంటున్నారు. అమెరికన్ కంపెనీలకే స్కిల్డ్ టెక్ ఉద్యోగులు కావాలి" అని మరో యూజర్ కౌంటర్ ఇచ్చారు.

సొంత దేశంలో ఉద్యోగం తెచ్చుకోలేని వారు, వేరే దేశాల వాళ్లపై ఏడవడం పరిపాటిగా మారిందని మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

వలసదారులపై ఉన్న వ్యతిరేక భావనకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని, ఏ దేశానికైనా, ఆ దేశ జెండాకైనా కనీస గౌరవం ఇవ్వడం సంస్కారమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement