Indian Railways | భారతీయ రైల్వేలో 191 ఐసోలేటెడ్ పోస్టులు.. సికింద్రాబాద్‌లో ఖాళీలు ఎన్నంటే?
Indian Railways | భారతీయ రైల్వేలో (Indian Railways) ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(RRB) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ ఐసొలేటెడ్ కేటగిరీల్లో ఉన్న 191 ఖాళీలను భర్తీ చేయనుంది.
Indian Railways | త్రినేత్ర న్యూస్: భారతీయ రైల్వేలో (Indian Railways) ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(RRB) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ ఐసొలేటెడ్ కేటగిరీల్లో ఉన్న 191 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైనవారు డిసెంబర్ 4 వరకు అధికారిక వెబ్‌సైట్ rrb.indianrailways.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, హిందీ జూనియర్ ట్రాన్స్‌లేటర్ (Junior Translator) వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ప్రతినెల రూ.19,900 నుంచి రూ.44,900 వరకు జీతం లభిస్తుంది. ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌లో 21 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 191
జనరల్ 98, ఎస్సీ 26, ఎస్టీ 14, ఓబీసీ 41, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 12 చొప్పున కేటాయించారు.
విభాగాల వారీగా..
జూనియర్ ట్రాన్స్‌లేటర్/హిందీ- 79 పోస్టులు
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III (కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్)- 36 పోస్టులు
స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్- 27 పోస్టులు
పబ్లిక్ ప్రాసిక్యూటర్- 21 పోస్టులు
చీఫ్ లా అసిస్టెంట్- 17 పోస్టులు
సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్- 8 పోస్టులు
సైంటిఫిక్ అసిస్టెంట్ (ట్రైనింగ్)- 3 పోస్టులు
అర్హతలు
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ నాటికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి సైన్స్ సబ్జెక్టు కలిగిన 10+2 లేదా తత్సమాన డిగ్రీ, డిప్లొమా, లా డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా అర్హత సాధించి ఉండాలి. ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న వారు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు. అభ్యర్థులు 22 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ట్రాన్స్‌లేషన్ టెస్ట్ (జూనియర్ ట్రాన్స్‌లేటర్, హిందీ పోస్టులకు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
రాతపరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు వస్తాయి. ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి 50 మార్కులకు 50 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 15 మార్కులకు 15 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 మార్కులకు 15 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 10 మార్కులకు 10 ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులు రూ.250
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 4
అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు: డిసెంబర్ 6
వెబ్‌సైట్: rrbapply.gov.in
పూర్తివివరాలకు..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
- ●Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు

Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్






