త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RRB NTPC | భార‌తీయ రైల్వేలో 5165 నాన్‌టెక్నిక‌ల్ ఉద్యోగాలు.. RRB ఎన్‌టీపీసీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

RRB NTPC | మీరు రైల్వే ఉద్యోగాల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారా?.. అయితే మీకు రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భార‌తీయ రైల్వేలో వివిధ జోన్ల‌లో ఖాళీగా ఉన్న నాన్‌- టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (NTPC) గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌కు సంబంధించిన‌ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) రంగం సిద్ధం చేసింది.

G

National | Published On Sep 25, 2026, 8.26 am IST

RRB NTPC | భార‌తీయ రైల్వేలో 5165 నాన్‌టెక్నిక‌ల్ ఉద్యోగాలు.. RRB ఎన్‌టీపీసీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌
Advertisement

RRB NTPC | త్రినేత్ర న్యూస్‌: మీరు రైల్వే ఉద్యోగాల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారా?.. అయితే మీకు రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భార‌తీయ రైల్వేలో వివిధ జోన్ల‌లో ఖాళీగా ఉన్న నాన్‌- టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (NTPC) గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌కు సంబంధించిన‌ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) రంగం సిద్ధం చేసింది. మొత్తం 5,165 పోస్టుల భ‌ర్తీకి ఈ నెల 26న‌ నోటిఫికేష‌న్ (RRB NTPC) విడుద‌ల చేయ‌నుంది. వీటిలో గ్రాడ్యుయేట్ (Graduate) పోస్టులు 3477, అండర్‌ గ్రాడ్యుయేట్ (Undergraduate) పోస్టులు 1688 ఉన్నాయి. గ్రూడ్స్ ట్రైన్ మేనేజ‌ర్‌, చీఫ్ క‌మ‌ర్షియ‌ల్ క‌మ్ టికెట్ సూప‌ర్‌వైజ‌ర్ (CCTS), జూనియ‌ర్ అకౌంట్స్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్ (JAA), సీనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్‌, ట్రైన్స్ క్ల‌ర్క్‌, క‌మర్షియ‌ల్ క‌మ్ టికెట్ క్లర్క్(CCTC), అకౌంట్స్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్‌, జూనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన వారు అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.in ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తుంది. అధికారిక నోటిఫికేష‌న్‌లో జోన్లలో ఉన్న ఖాళీల వివ‌రాలు తెలియ‌నున్నాయి.

మొత్తం ఖాళీలు- 5165

గ్రాడ్యుయేట్ పోస్టులు: 3,477
ఇందులో గ్రూడ్స్ ట్రైన్ మేనేజ‌ర్ 2,750, చీఫ్ క‌మ‌ర్షియ‌ల్ క‌మ్ టికెట్ సూప‌ర్‌వైజ‌ర్ (CCTS) 56, జూనియ‌ర్ అకౌంట్స్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్ (JAA) 300, సీనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్ 371 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

 

అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. అభ్య‌ర్థులు 18 నుంచి 33 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్కులై ఉండాలి.
ఎంపిక ప్ర‌క్రియ‌: కంప్యూట‌ర్ ఆధారిత‌ రాత‌ప‌రీక్ష (సీబీటీ 1, సీబీటీ 2), టైపింగ్ స్కిల్ టెస్ట్ (టైపిస్ట్ పోస్టుల‌కు) ద్వారా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్​లైన్‌లో
అప్లికేష‌న్‌ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, మ‌హిళ‌లు, దివ్యాంగులు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌, ట్రాన్స్‌జెండ‌ర్లు, మైనార్టీలు రూ.250.
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 8
ఆన్​లైన్ దరఖాస్తుల చివరి తేదీ: నవంబర్ 6
వెబ్‌సైట్‌: www.rrbapply.gov.in

ఎన్​టీపీసీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌) పోస్టులు: 1,688

ఇందులో క‌మర్షియ‌ల్ క‌మ్ టికెట్ క్లర్క్(CCTC) 700, జూనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్ 600, అకౌంట్స్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్ 200, ట్రైన్స్ క్ల‌ర్క్ 188 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: 12వ తరగతి(ఇంటర్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. కొన్ని పోస్టులకు కంప్యూటర్‌పై ఇంగ్లిష్ లేదా హిందీ టైపింగ్ నైపుణ్యం త‌ప్ప‌నిస‌రి. అభ్య‌ర్థులు 18 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక ప్ర‌క్రియ‌: కంప్యూట‌ర్ ఆధారిత‌ రాత‌ప‌రీక్ష (సీబీటీ 1, సీబీటీ 2), టైపింగ్ స్కిల్ టెస్ట్ (టైపిస్ట్ పోస్టుల‌కు) ద్వారా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్​లైన్‌లో
అప్లికేష‌న్‌ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, మ‌హిళ‌లు, దివ్యాంగులు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌, ట్రాన్స్‌జెండ‌ర్లు, మైనార్టీలు రూ.250.
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 15
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 13
వెబ్‌సైట్‌: www.rrbapply.gov.in

Advertisement
Advertisement