త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RRB Station Master | 1250 పోస్టుల‌తో ఆర్ఆర్బీ రైల్వే స్టేష‌న్ మాస్ట‌ర్ నోఫికేష‌న్‌.. మారిన ప‌రీక్ష విధానం..

RRB Station Master | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) స్టేషన్ మాస్టర్ (Station Master) ఉద్యోగాల భర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 1250 ఖాళీలతో నోటిఫికేషన్‌ను విడుదల (RRB Station Master) చేసింది.

G

National | Published On Oct 22, 2026, 6.23 am IST

RRB Station Master | 1250 పోస్టుల‌తో ఆర్ఆర్బీ రైల్వే స్టేష‌న్ మాస్ట‌ర్ నోఫికేష‌న్‌.. మారిన ప‌రీక్ష విధానం..
Advertisement

RRB Station Master | త్రినేత్ర న్యూస్‌: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) స్టేషన్ మాస్టర్ (Station Master) ఉద్యోగాల భర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 1250 ఖాళీలతో నోటిఫికేషన్‌ను విడుదల (RRB Station Master) చేసింది. ఆస‌క్తి క‌లిగిన‌వారు అధికారిక వెబ్‌సైట్‌లో అక్టోబ‌ర్ 27 నుంచి న‌వంబ‌ర్ 27 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది. ఉద్యోగానికి ఎంపికైన వారికి ప్ర‌తినెల‌ బేసిక్ పే రూ.35,400తోపాటు అలవెన్సులు (మొత్తం రూ.73,201) అదనంగా లభిస్తాయి.

స్టేషన్ మాస్టర్ పోస్టులను సాధారణ ఎన్టీపీసీ (NTPC) రిక్రూట్‌మెంట్ నుంచి రైవ్వే బోర్డు వేరు చేసింది. ఇక‌పై ప్రత్యేకంగా సెంట్ర‌లైజ్డ్‌ నోటిఫికేషన్ ద్వారా ఈ ఖాళీల‌ను భ‌ర్తి చేయ‌నుంది. క‌నీస వ‌యోప‌రిమితిని పెంచ‌డంతోపాటు, రాత‌ప‌రీక్ష‌లోనూ మార్పులు చేసింది. గ‌తంలో రెండు కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌లు (100 + 120) మొత్తం 220 మార్కులు ఉండేవి. ఇప్పుడు దానిని ఒకే ప‌రీక్ష‌కు (100 మార్కులు) త‌గ్గించింది. గ‌తంలో 180 నిమిషాల్లో (రెండు ప‌రీక్ష‌ల‌కు 90 నిమిషాల చొప్పున‌) ప‌రీక్ష పూర్తిచేయాల్సి ఉండ‌గా, ఇప్పుడు దానిని 120 నిమిషాల‌కు కుదించింది.

మొత్తం ఖాళీలు: 1250

అర్హ‌త‌లు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్య‌ర్థులు 20 నుంచి 33 ఏండ్ల‌ (3 సంవత్సరాల సాధారణ సడలింపుతో కలిపి) మధ్య వ‌య‌స్కుల‌వ్వాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: CBT పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్‌. సీబీటీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. దీనికి 120 నిమిషాల (2 గంటలు) సమయం కేటాయించారు. ఇందులో అర్హత సాధించిన వారికి తదుపరి దశలో కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.

రాత‌ప‌రీక్ష‌లో బేసిక్ సైన్స్ (Basic Science), మ్యాథమెటిక్స్ (Mathematics), డేటా అన‌లిటిక‌ల్ కేప‌బిలిటీ (Data Analysis) నుంచి 60 మార్కులు, లాజికల్ కేపబిలిటీ (Logical Capability) 20, మెంటల్ రీజనింగ్ (Mental Reasoning) 20 మార్కుల చొప్పున ఉంటాయి.

మారిన ప‌రీక్ష విధానం..

కొత్త పరీక్ష విధానం ప్రకారం స్టేషన్‌ మాస్టర్‌ పోస్టులకు నిర్వహించే సీబీటీ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష పూర్తి చేయడానికి 120 నిమిషాల సమయం కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు.

సిలబస్‌లో ఇంగ్లిష్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌

కొత్త పరీక్ష విధానంలో ఇంగ్లిష్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ను చేర్చారు. లాజికల్ కేప‌బిలిటీ విభాగంలో భాగంగా దీనిని పరిగణిస్తారు. ఇంగ్లిష్‌లో ఇచ్చిన పేరాలను చదివి, వాటి ఆధారంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. చరిత్ర, సమాజం, సాహిత్యం, సైన్స్‌, పర్యావరణం, సాంకేతికత, సంస్కృతి, పురాణాలు, ఇతర భావనాత్మక అంశాలకు సంబంధించిన పేరాలపై ప్రశ్నలు రావచ్చు.

మ్యాథమెటిక్స్‌, బేసిక్‌ సైన్స్

గణితం, ప్రాథమిక సైన్స్‌ విభాగాలకు కలిపి 30 మార్కుల వెయిటేజీ ఉంటుంది.
సంఖ్యా వ్యవస్థలునిష్పత్తి, అనుపాతం, సగటులు
శాతాలు, లాభనష్టాలు
కాలం, వేగం, దూరం
పని, కాలం
బీజగణితం, జ్యామితి, త్రికోణమితి
వైశాల్యం, ఘనపరిమాణం
సంభావ్యత, గణాంకాలు
బేసిక్‌ సైన్స్‌లో.. ప్రమాణాలు, కొలతలు, ద్రవ్యరాశి, సాంద్రత, శక్తి, చలనం, ఘర్షణ, ఉష్ణం, ఉష్ణోగ్రత, విద్యుత్‌, సరళ యంత్రాలు వంటి అంశాలు ఉంటాయి.

డేటా అనాలిసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్

డేటా విశ్లేషణ, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పరీక్షించే విభాగానికి 30 మార్కుల వెయిటేజీ కేటాయించారు. ఇందులో పట్టికలు, గ్రాఫ్‌లు, పై చార్ట్‌లు, స్కాటర్‌ ప్లాట్లు, గణాంక పంపిణీలు, వెన్‌ డయాగ్రామ్‌లు, డేటా సఫిషియెన్సీ, డేటా అమరికకు సంబంధించిన ప్రశ్నలు ఉండవచ్చు. ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి, సరైన నిర్ధారణలకు రావడం ఈ విభాగం ముఖ్య ఉద్దేశం.

లాజికల్‌, మెంటల్‌ రీజనింగ్‌

రీజనింగ్‌ విభాగాన్ని రెండు భాగాలుగా విభజించారు.

లాజికల్‌ ఎబిలిటీ- 20 మార్కులు: బైనరీ లాజిక్‌, సిలోజిజమ్స్‌, గడియారాలు, క్యాలెండర్లు, పర్సెప్షన్‌, రక్త సంబంధాలు, కుటుంబ వృక్షాలు, లాజిక్‌ పజిల్స్‌ వంటి అంశాలు ఉంటాయి.
మెంటల్‌ రీజనింగ్‌- 20 మార్కులు: అనలజీ, నంబర్‌ లేదా లెటర్‌ సిరీస్‌, కోడింగ్‌-డీకోడింగ్‌, ర్యాంకింగ్‌, అమరికకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: అక్టోబ‌ర్ 27 నుంచి
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 27
వెబ్‌సైట్‌: rrbapply.gov.in

Advertisement
Advertisement