Railway Station Master | రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు కనీస వయస్సు 20 ఏండ్లకు పెంపు..
Railway Station Master | రైల్వే స్టేషన్ మాస్టర్ (Railway Station Master) ఉద్యోగాల వయోపరిమితిపై రైల్వే బోర్డు (Railway Board) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే స్టేషన్ మాస్టర్ పోస్టులకు కనీస వయోపరిమితిని (Minimum Age) పెంచింది.
Railway Station Master | త్రినేత్ర న్యూస్: రైల్వే స్టేషన్ మాస్టర్ (Railway Station Master) ఉద్యోగాల వయోపరిమితిపై రైల్వే బోర్డు (Railway Board) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే స్టేషన్ మాస్టర్ పోస్టులకు కనీస వయోపరిమితిని (Minimum Age) పెంచింది. ఇప్పటిరకు 18 ఏండ్లుగా ఉన్న అర్హత వయస్సును 20 ఏండ్లకు పెంచింది. ఈ మేరకు గతంలో ఉన్న కనీస, గరిష్ట వయసు 18-30 ఏండ్ల వయోపరిమితి (Age Limit) నిబంధనను సవరించింది. ఇది అక్టోబర్ 7 నుంచే అమల్లోకి వచ్చిందని ప్రకటించింది. అయితే అంతకుముందే విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. దీంతో నూతన నిబంధన ప్రకారం స్టేషన్ మాస్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుండి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
స్టేషన్ మాస్టర్ ఉద్యోగంలో ఉండే పని ఒత్తిడి, తక్షణమే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యతలు, రైళ్ల నిర్వహణ భద్రతను పరిగణనలోకి తీసుకుని ఈ కనీస వయోపరిమితిని పెంచినట్లు రైల్వే శాఖ తెలిపింది. వయోపరిమితి సడలింపు ఉత్తర్వులను అన్ని జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్లు, ప్రొడక్షన్ యూనిట్లు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల (RRB) చైర్మన్లకు పంపించింది. ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ (AISMA) ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇది తమ సుదీర్ఘకాల డిమాండ్ అని అసోసియేషన్ తెలిపింది. `స్టేషన్ మాస్టర్ ఉద్యోగానికి కనీస విద్యా అర్హత డిగ్రీ (గ్రాడ్యుయేషన్), అభ్యర్థులు తమ డిగ్రీ పూర్తి చేసే సమయానికి సాధారణంగా 20 ఏండ్లు నిండుతాయి లేదా దాటుతాయి. 18 ఏండ్లకే ఎవరూ డిగ్రీ పూర్తి చేయలేరు. కాబట్టి ఈ వయోపరిమితి సవరణ విద్యా అర్హతలకు అనుగుణంగానే ఉంది` అని AISMA ప్రధాన కార్యదర్శి శరద్ చంద్ర పురోహిత్ చెప్పారు.
సంబంధిత వార్తలు

RRB NTPC | భారతీయ రైల్వేలో 5165 నాన్టెక్నికల్ ఉద్యోగాలు.. RRB ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల
సెప్టెంబర్ 25, 2026

Police Recruitment | మరో రెండేండ్లు.. యూనిఫామ్ సర్వీసు పోస్టులకు వయోపరిమితి పెంపు..
ఆగస్టు 15, 2026

RRB Recruitment | 3993 పోస్టులతో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్.. దరఖాస్తులు షురూ..
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | రోడ్డు ప్రమాదాల నివారణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Door of Hell Turkmenistan | భూమిపై 'నరక ద్వారం' ఎక్కడుందో తెలుసా? 50 ఏళ్లుగా ఆరకుండా మండుతున్న ఈ మిస్టరీ వెనుక అసలు కథ ఇదే!
- ●Hyundai | హ్యుందాయ్ కార్లకు భారీ రీకాల్.. అగ్ని ప్రమాద ముప్పు..
- ●Neha Bora | మహిళలను రాత్రిపూట నిర్బంధించడమేంటి..? ఇది ఏ చట్టప్రకారం సమర్థనీయం : నేహా బోరా
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పెట్టుబడుల జోరు.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..
- ●CJP Mumbai Protests Flops | ముంబైలో సీజేపీ నిరసన అట్టర్ ఫ్లాప్

Ponnam Prabhakar | రోడ్డు ప్రమాదాల నివారణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

Door of Hell Turkmenistan | భూమిపై 'నరక ద్వారం' ఎక్కడుందో తెలుసా? 50 ఏళ్లుగా ఆరకుండా మండుతున్న ఈ మిస్టరీ వెనుక అసలు కథ ఇదే!

Hyundai | హ్యుందాయ్ కార్లకు భారీ రీకాల్.. అగ్ని ప్రమాద ముప్పు..

Neha Bora | మహిళలను రాత్రిపూట నిర్బంధించడమేంటి..? ఇది ఏ చట్టప్రకారం సమర్థనీయం : నేహా బోరా



