RRB JE Recruitment | రైల్వేలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. 4వేలకుపైగా పోస్టులకు ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్
RRB JE Recruitment | భారతీయ రైల్వే (Indian Railway) లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి మరో నోటిఫికేషన్ వచ్చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజినీర్ (Junior Engineer) పోస్టుల భర్తీ నియామక ప్రక్రియ ప్రారంభించింది.
RRB JE Recruitment | త్రినేత్ర.న్యూస్: భారతీయ రైల్వే (Indian Railway) లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి మరో నోటిఫికేషన్ వచ్చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజినీర్ (Junior Engineer) పోస్టుల భర్తీ నియామక ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 4098 ఖాళీలతో నోటిఫికేషన్ (RRB JE Recruitment) విడుదల చేసింది. ఇందులో జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 13 వరకు rrbcdg.gov.inలో దరఖాస్తు చేసుకోచ్చు. ఎంపికైన వారు ప్రారంభ వేతనం నెలకు రూ.35,400 అందుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 4098
అర్హతలు: జూనియర్ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ, డీఎంఎస్ పోస్టులకు ఇంజినీరింగ్ లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్, సీఎంఏ పోస్టులకు కెమిస్ట్రీ లేదా మెటలర్జీ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 33 ఏండ్ల మధ్య వయసు ఉండాలి.
ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రైల్వే మెడికల్ టెస్ట్ ఆధారంగా. సీబీటీ-1లో 100 ప్రశ్నలు, సీబీటీ-2లో 150 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కొత విధిస్తారు. పరీక్ష 90 నిమిషాలు, 120 నిమిషాల్లో పూర్తి చేయాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 14
అప్లికేషన్లకు చివరితేదీ: సెప్టెంబర్ 13
వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/
సంబంధిత వార్తలు

RRB JE Recruitment | 4098 పోస్టులతో ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్..
ఆగస్టు 6, 2026

BJP Ramchandar Rao | ఇకనుంచి ఏ పరీక్ష పేపర్ లీకైనా 10 ఏండ్ల జైలు.. 15 కోట్ల ఫైను
జులై 25, 2026

SCR Special Trains | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. చర్లపల్లి-కొల్లం మధ్య స్పెషల్ రైళ్లు..!
జులై 20, 2026
తాజావార్తలు
- ●Princess Isabella | సైన్యంలో చేరిన డెన్మార్క్ యువరాణి ఇసాబెల్లా.. సరికొత్త రికార్డు
- ●Jio Black Rock | జియో ఈటీఎఫ్ వచ్చేసింది.. రూ.500 ఉంటే చాలు..
- ●VC Sajjanar | ఎటు పోతున్నది ఈ సమాజం?.. మానవత్వానికే మచ్చతెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి: సీపీ సజ్జనర్
- ●Salman Khan | రూ.3 కోట్ల మోసం కేసు.. సల్మాన్ ఖాన్కు కోర్టు సమన్లు
- ●Ration Card | ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డుల పంపిణీ..
- ●Donald Trump | ప్రయాణికుల ఫ్లైట్కు దగ్గరగా వెళ్లిన ట్రంప్ మెరైన వన్ హెలికాప్టర్

Princess Isabella | సైన్యంలో చేరిన డెన్మార్క్ యువరాణి ఇసాబెల్లా.. సరికొత్త రికార్డు

Jio Black Rock | జియో ఈటీఎఫ్ వచ్చేసింది.. రూ.500 ఉంటే చాలు..

VC Sajjanar | ఎటు పోతున్నది ఈ సమాజం?.. మానవత్వానికే మచ్చతెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి: సీపీ సజ్జనర్

Salman Khan | రూ.3 కోట్ల మోసం కేసు.. సల్మాన్ ఖాన్కు కోర్టు సమన్లు



