Vande Bharat Sleeper | పరుగులు తీసిన వందే భారత్ స్లీపర్ రైలు.. తొలిరోజు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన
Vande Bharat Sleeper | దేశంలోనే రెండో స్లీపర్ ఢిల్లీ-వారణాసి మధ్య పరుగులు తీసింది. ఇటీవల కేంద్రమంత్రి అశ్విణి వైష్ణవ్ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల నుంచి భారీ స్పందన రావడంతో తొలి రోజే టికెట్లన్నీ దాదాపు బుక్ అయ్యాయి.
Vande Bharat Sleeper | దేశంలోనే రెండో స్లీపర్ ఢిల్లీ-వారణాసి మధ్య పరుగులు తీసింది. ఇటీవల కేంద్రమంత్రి అశ్విణి వైష్ణవ్ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల నుంచి భారీ స్పందన రావడంతో తొలి రోజే టికెట్లన్నీ దాదాపు బుక్ అయ్యాయి. దీపావళి వరకు పలు తరగతుల్లో వెయిటింగ్ లిస్ట్ కొనసాగుతోంది. వారణాసి నుంచి ప్రతి శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో రాత్రి 8.50 గంటలకు స్లీపర్ వందేభారత్ బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. మార్గమధ్యలో ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్, ఘజియాబాద్ స్టేషన్లలో ఆగుతుంది. అదేవిధంగా న్యూఢిల్లీ నుంచి ప్రతి శనివారం మినహా మిగిలిన రోజుల్లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు వారణాసి చేరుకుంటుంది.
ఛార్జీలు ఎంతంటే?
స్లీపర్ వందేభారత్‌లో ప్రయాణానికి క్లాస్‌ల వారీగా చార్జీలను రైల్వేశాఖ నిర్ణయించింది. ఫస్ట్ ఏసీకి రూ.3,030, సెకండ్ ఏసీకి రూ.2,470, థర్డ్ ఏసీకి రూ.1,915 చార్జీ నిర్ణయించారు. ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో థర్డ్ ఏసీ ఛార్జీ సుమారు రూ.1,170 ఉండగా.. వందేభారత్‌లో రూ.745 అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణంలో మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వారణాసి నుంచి ఢిల్లీకి వందేభారత్ చైర్‌కార్ రైలు సుమారు 8 గంటల్లో చేరుకుంటోంది. స్లీపర్ వందేభారత్ మాత్రం 9 గంటల 20 నిమిషాల సమయం తీసుకోనుంది. రాత్రి ప్రయాణం కావడంతో బెర్త్‌లలో విశ్రాంతి తీసుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
సబర్మతి సూపర్‌ఫాస్ట్ కూడా..
మరోవైపు వారణాసి నుంచి సబర్మతికి నడిచే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. రైలు నంబర్ 12206 ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటలకు వారణాసి కంటోన్మెంట్ నుంచి బయలుదేరి.. ప్రయాగ్‌రాజ్, జైపూర్, అజ్మీర్ మీదుగా మరుసటి రోజు రాత్రి 8.15 గంటలకు సబర్మతి చేరుకుంటుంది. ఈ రైలులో స్లీపర్ ఛార్జీ రూ.685, థర్డ్ ఏసీ రూ.1,745, సెకండ్ ఏసీ రూ.2,475గా నిర్ణయించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mrunal Thakur | 15 కోట్ల బడ్జెట్ - కోటి కలెక్షన్స్ - ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ డిజాస్టర్ మూవీ
- ●Govardhan Puja 2026 | గోవర్ధన పూజ: ఆవు పేడతో కొండను ఎందుకు చేస్తారు? నగరాల్లో పురుడుపోసుకుంటున్న సరికొత్త సంప్రదాయం
- ●Gold Rate | దీపావళి వేళ మళ్లీ మెరిసిన బంగారం.. ధరలు ఎంత పెరిగాయంటే..?
- ●Rashmika Mandanna | వైల్డ్ లుక్‌లో రష్మిక - మైసా ఫస్ట్ సింగిల్ రిలీజ్
- ●Actor Imran Khan | భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనను.. బాంబే హైకోర్టుకు హీరో ఇమ్రాన్ క్షమాపణలు..!
- ●Abdullah Family Kashmiri Pandit Roots | నిధి రజ్దాన్‌తో ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి: కశ్మీరీ పండిట్లతో అబ్దుల్లా కుటుంబానికి ఉన్న శతాబ్దాల బంధం ఏమిటి?

Mrunal Thakur | 15 కోట్ల బడ్జెట్ - కోటి కలెక్షన్స్ - ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ డిజాస్టర్ మూవీ

Govardhan Puja 2026 | గోవర్ధన పూజ: ఆవు పేడతో కొండను ఎందుకు చేస్తారు? నగరాల్లో పురుడుపోసుకుంటున్న సరికొత్త సంప్రదాయం

Gold Rate | దీపావళి వేళ మళ్లీ మెరిసిన బంగారం.. ధరలు ఎంత పెరిగాయంటే..?

Rashmika Mandanna | వైల్డ్ లుక్‌లో రష్మిక - మైసా ఫస్ట్ సింగిల్ రిలీజ్




