Indian Railway | భారతీయ రైల్వేలో 4651 అప్రెంటిస్‌లు..
Indian Railway | రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ - నార్తర్న్ రీజియన్ (RRC NR) వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టుల (Apprentice) భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 4,651 ఖాళీలతో నోటిఫికేషన్ (Indian Railway) విడుదల చేసింది.
Indian Railway | త్రినేత్ర న్యూస్: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ - నార్తర్న్ రీజియన్ (RRC NR) వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టుల (Apprentice) భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 4,651 ఖాళీలతో నోటిఫికేషన్ (Indian Railway) విడుదల చేసింది. 10+2, ఐటీఐ చేసిన వారు అర్హులు. ఆసక్తి కలిగినవారు ఆర్‌ఆర్‌సీ ఎన్‌ఆర్ అధికారిక వెబ్‌సైట్ rrcnr.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఖాళీలు లక్నో, ఢిల్లీ, ఫిరోజ్‌పూర్, మొరదాబాద్, అంబాలా, జమ్ము క్లస్టర్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు: 4651
ఇందులో లక్నో క్లస్టర్‌లో 1525, ఢిల్లీలో 1312, ఫిరోజ్‌పూర్‌లో 740, మొరదాబాద్‌లో 63, అంబాలా 979, జమ్ము క్లస్టర్‌లో 32 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి (ఎస్సెస్సీ/మెట్రిక్యులేషన్) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల (NCVT/SCVT) గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) కోర్సు పూర్తిచేయాలి. 2026 డిసెంబర్ 11 నాటికి 15 ఏండ్లు నిండినవారై ఉండాలి. 24 ఏండ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. 10వ తరగతిలో సాధించిన మార్కులు, ఐటీఐ పరీక్షలో వచ్చిన మార్కులకు సమాన ప్రాధాన్యం (50:50 నిష్పత్తి) ఇస్తూ అభ్యర్థుల సగటు మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. క్లస్టర్, ట్రేడ్, సామాజిక వర్గాల వారీగా ఈ మెరిట్ ఆధారంగానే తుది అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ. 100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 11
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 11
మెరిట్ జాబితా: 2027 ఫిబ్రవరి నెలలో
వెబ్‌సైట్: www.rrcnr.org
సంబంధిత వార్తలు

HCU | హెచ్‌సీయూలో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. నవంబర్ 16 వరకు దరఖాస్తులు
నవంబర్ 9, 2026

DSSSB Recruitment | DSSSBలో జూనియర్ ఇంజినీర్, ఎంటీఎస్ ఉద్యోగాలు.. 1260 పోస్టులతో నోటిఫికేషన్
నవంబర్ 7, 2026

Indian Bank | ఇండియన్ బ్యాంక్‌లో 1500 అప్రెంటిస్‌లు.. తెలంగాణలో ఎన్ని ఖాళీలు అంటే?
నవంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Pawan Kalyan | మూడోసారి పవన్ కల్యాణ్ విడాకులు.. అన్నా లెజినోవాతో డివర్స్
- ●Horoscope | నవంబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●LB Nagar Sadar Festival Accident | సదర్ ఉత్సవాల్లో విషాదం: దున్నపోతును ఆడిస్తూ కుప్పకూలి 16 ఏళ్ల బాలుడు మృతి
- ●Bangladesh Woman Fake Aadhaar Hyderabad | బంగ్లాదేశ్ యువతి నకిలీ ఆధార్‌తో భారతీయురాలిగా చలామణి.. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా వెలుగులోకి!
- ●Revanth Reddy | పోలేపల్లి ఎల్లమ్మ తల్లిపై ఆన.. డిసెంబర్ నాటికి కొడంగల్ బీడు భూములు తడుపుతా
- ●Celebrities Diwali 2026 Celebrations | సినీ తారల దీపావళి ధమాకా.. స్పెషల్ ఫోటో గ్యాలరీ!

Pawan Kalyan | మూడోసారి పవన్ కల్యాణ్ విడాకులు.. అన్నా లెజినోవాతో డివర్స్

Horoscope | నవంబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారికి శుభ ఖర్చులు ఉంటాయి!

LB Nagar Sadar Festival Accident | సదర్ ఉత్సవాల్లో విషాదం: దున్నపోతును ఆడిస్తూ కుప్పకూలి 16 ఏళ్ల బాలుడు మృతి

Bangladesh Woman Fake Aadhaar Hyderabad | బంగ్లాదేశ్ యువతి నకిలీ ఆధార్‌తో భారతీయురాలిగా చలామణి.. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా వెలుగులోకి!



