RRB | భారతీయ రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. మే 15 నుంచి అప్లికేషన్లు షురూ..
RRB | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల నియామకాలకు భారతీయ రైల్వే (Indian Railway) రంగం సిద్ధంచేసింది. వివిధ రీజియన్లలో మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
RRB | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల నియామకాలకు భారతీయ రైల్వే (Indian Railway) రంగం సిద్ధంచేసింది. వివిధ రీజియన్లలో మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులు మే 15న ప్రారంభంకానుంది. రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ పోస్టులను సికింద్రాబాద్ సహా అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్, చెన్నై, గోరఖ్‌పూర్, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో భర్తీ చేయనుంది. సికింద్రాబాద్ రీజియన్‌లో 674 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 11,127
జోన్‌ల వారీగా..
- సెంట్రల్ రైల్వే- 1400
- ఈస్ట్ సెంట్రల్ రైల్వే- 700
- ఈస్ట్ కోస్ట్ రైల్వే- 1625
- ఈస్టర్న్ రైల్వే- 608
- నార్త్ సెంట్రల్ రైల్వే- 457
- నార్త్ ఈస్టర్న్ రైల్వే- 105
- నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే- 1276
- నార్తర్న్ రైల్వే- 740
- నార్త్ వెస్ట్రన్ రైల్వే- 600
- సౌత్ సెంట్రల్ రైల్వే- 674
- సైత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే- 200
- సౌత్ ఈస్టర్న్ రైల్వే- 1531
- సౌతర్న్ రైల్వే- 250
- సౌత్ వెస్టర్న్‌రైల్వే- 200
- వెస్ట్ సెంట్రల్ రైల్వే- 541
- వెస్టర్న్ రైల్వే- 214
- చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్- 06
అర్హత: సంబంధిత విభాగాలు, ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: జూన్ 01 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏండ్లు, ఓబీసీలకు మూడేండ్ల సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం: నెలకు రూ.19900.
ఎంపిక విధానం: ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, రాత పరీక్ష తేదీలు వంటి ఇతర వివరాలు త్వరలో విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 15
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 14
వెబ్‌సైట్: www.rrbapply.gov.in
సంబంధిత వార్తలు

RRB ALP Recruitment | భారతీయ రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోక్‌పైలట్ పోస్టులు.. సికింద్రాబాద్ జోన్లో ఖాళీలు?
మే 16, 2026

SATHEE App | JEE, NEET అభ్యర్థులకు ఉచిత లెర్నింగ్ యాప్.. ప్రవేశపెట్టిన కేంద్రం..
మార్చి 15, 2026

Railway Recruitment | పది అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా!
ఫిబ్రవరి 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



