త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rishi Sunak | ఏఐ ఎన్నో చేయ‌గ‌ల‌దు.. కానీ ఢిల్లీ ట్రాఫిక్‌ను మాత్రం ఫిక్స్ చేయ‌లేదు : రిషి సునాక్

Rishi Sunak | ఢిల్లీలో జ‌రుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ సంద‌ర్భంగా ఢిల్లీలో ట్రాఫిక్ (Delhi traffic)పై మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది.

D

National | Published On Feb 20, 2026, 1.05 pm IST

Rishi Sunak | ఏఐ ఎన్నో చేయ‌గ‌ల‌దు.. కానీ ఢిల్లీ ట్రాఫిక్‌ను మాత్రం ఫిక్స్ చేయ‌లేదు : రిషి సునాక్
Advertisement

Rishi Sunak | దేశంలో ట్రాఫిక్ లేని న‌గ‌రం లేదు. ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు. చెన్నై, హైద‌రాబాద్‌.. ఇలా ప్ర‌తీ న‌గ‌రంలో విప‌రీత‌మైన ట్రాఫిక్ ఉంటోంది. ట్రాఫిక్‌పై సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో జ‌రుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ సంద‌ర్భంగా ఢిల్లీలో ట్రాఫిక్ (Delhi traffic)పై మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది. అందుకు కార‌ణం బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాన మంత్రి రిషి సునాకే (Rishi Sunak).

ఏఐ స‌మ్మిట్‌లో భాగంగా బ్రిటిష్ హైక‌మిష‌న్‌లో యూకే ఉప ప్ర‌ధాన మంత్రి డేవిడ్ లామీతో క‌లిసి జ‌రిగిన సంయుక్త స‌మావేశానికి సునాక్ (Rishi Sunak) కాస్త ఆల‌స్యంగా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియా మిత్రుల‌కు, అధికారులు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఢిల్లీలో ట్రాఫిక్ వ‌ల్లే తాను ఆల‌స్యంగా వ‌చ్చిన‌ట్లు చెప్పారు. "క్ష‌మించండి. కొంచెం ఆల‌స్య‌మైంది. అది పూర్తిగా నాత‌ప్పే. ఈ వారం మ‌నం విన్న‌ట్లుగా ఏఐ (AI) చాలా ప‌నులు చేయ‌గ‌ల‌దు. కానీ అది ఇంకా ఢిల్లీ ట్రాఫిక్ స‌మ‌స్య‌ను మాత్రం ప‌రిష్క‌రించ‌లేక‌పోతోంది. దీని గురించి కూడా మ‌నం ఆలోచించాలి" అంటూ చ‌మ‌త్క‌రించారు. రిషి సునాక్ మాట‌ల‌తో అక్క‌డ న‌వ్వులు పూశాయి. అంతేకాదు, మాన‌వ అనుభ‌వాల‌ను ఏఐ భ‌ర్తీ చేయ‌ల‌దేని సునాక్ తెలిపారు. పేఫ్టీతో కూడిన ఆవిష్క‌ర‌ణ‌లు చేయ‌డానికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Advertisement
Advertisement