త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | 2022లోనే ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్‌కు అనుమ‌తిచ్చారు

CM Revanth Reddy | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న పల్నాడు వాట‌ర్ గ్రిడ్‌కు 2022లోనే అనుమ‌తులు ఇచ్చార‌ని, నాటి సీఎంలు కేసీఆర్, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలోనే అంగీకారం కుదిరింద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Nov 23, 2026, 5.55 pm IST

CM Revanth Reddy | 2022లోనే ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్‌కు అనుమ‌తిచ్చారు
Advertisement

ఇందులో మా ప్ర‌మేయం లేదు
ఈ ప్రాజెక్టుపై మేం కేఆర్ఎంబీకి, కేంద్రానికి ఫిర్యాదు చేశాం
మా చిత్త‌శుద్ధిని ప్ర‌శ్నించాల్సిన అవ‌సరం లేదు
మీడియా స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న పల్నాడు వాట‌ర్ గ్రిడ్‌కు 2022లోనే అనుమ‌తులు ఇచ్చార‌ని, నాటి సీఎంలు కేసీఆర్, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలోనే అంగీకారం కుదిరింద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ విష‌యంలో ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేద‌ని, కావాల‌నే బీఆర్ఎస్ మాపై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని సీఎం నిప్పులు చెరిగారు. మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌తో క‌లిసి సీఎం రేవంత్ రెడ్డి సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.

కృష్ణా న‌దీ జ‌లాల‌ను ఏపీకి కాంగ్రెస్ తాక‌ట్టు పెట్టింద‌ని బీఆర్ఎస్ అంటుంది. తెలంగాణ హ‌క్కుల‌ను కాపాడ‌డం లేదు. మేం ఉన్న‌ప్పుడు చాలా ప‌క్క‌డండీగా ఏపీని నియంత్రించామ‌ని, తెలంగాణ నీటి హ‌క్కుల‌ను కాపాడినం అని బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. వాద‌న‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి అబ‌ద్ధాల‌ను న‌మ్ముకుని త‌ప్పుడు ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి కాంగ్రెస్ పార్టీని బ‌ద్నాం చేయాల‌నే ప్ర‌ణాళిక అమ‌లు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత‌ల‌పై సీఎం విరుచుకుప‌డ్డారు.

అర్ధ స‌త్యాల‌తో బుర‌ద‌జల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు

హ‌రీశ్‌రావు, కేటీఆర్ క‌లిసి ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్‌పై వారి పేప‌ర్లు, టీవీల‌తో పాటు ఇత‌ర వేదిక‌ల‌పై దీనికి కాంగ్రెస్ పార్టీ, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ప్ర‌జా ప్ర‌భుత్వం కార‌ణ‌మ‌ని చాలా ర‌కాలుగా అర్ధ స‌త్యాల‌తో బుర‌ద‌జల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆధారాల‌తో స‌హా న‌దీ జ‌లాల మీద.. మొద‌టి ద‌శ 2004 నుంచి 2006 వ‌ర‌కు ఉమ్మ‌డి ఏపీలో టీఆర్ఎస్ నేతలు మంత్రులుగా కొన‌సాగి, యూపీఏ1లో కేసీఆర్ మంత్రిగా కొన‌సాగిన సంద‌ర్భంగా, 2014లో రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత‌ కేసీఆర్ సీఎంగా, హ‌రీశ్‌రావు మంత్రిగా తెలంగాణ ప్ర‌జ‌ల యొక్క‌ హ‌క్కుల‌ను శాశ్వ‌తంగా ఏపీకి ఆనాటి సీఎంల‌కు ఏ విధంగా తాక‌ట్టు పెట్టారో వివ‌రాల‌ను, జీవోల‌ను మీడియాకు ముందు ఉంచుతున్నాన‌ని తెలిపారు.

మీడియా కూడా వాస్త‌వాల‌ను ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంది

మేం సంక్షేమం అమ‌లు చేయ‌డం, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ముందుకు తీసుకెళ్లే క్ర‌మంలో మునిగి తేలుతుంటే ఖాళీగా ఉన్న బీఆర్ఎస్ నేత‌లు అబ‌ద్ధాల‌ను ప్ర‌చారం చేసుకుంటూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. మీడియా కూడా వారి అబ‌ద్ధాల‌ను ప్ర‌చురించి అపోహ క‌లిగే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మీడియా కూడా వాస్త‌వాల‌ను కొంత ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంది. మేం, బీఆర్ఎస్ ప్ర‌క‌ట‌న చేశామ‌ని మొద‌టి పేజీలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌డం ద్వారా ప‌రోక్షంగా ఈ అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలు ప్ర‌జ‌లు న‌మ్మ‌డానికి దోహ‌ద‌ప‌డే విధంగా ఉందని సీఎం రేవంత్ ధ్వ‌జ‌మెత్తారు.

కేసీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు జీవో నం 56ను విడుద‌ల

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్‌ను అడ్డుకోలేద‌ని బీఆర్ఎస్ నేత‌లు అంటున్నారు. 2022 ఫిబ్ర‌వ‌రి 16న జ‌గ‌న్ సీఎంగా, కేసీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు జీవో నం 56ను విడుద‌ల చేశారు. ఏపీ ప్ర‌భుత్వం రూర‌ల్ వాట‌ర్ స‌ప్లై శానిటేష‌న్ డిపార్ట్‌మెంట్, జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద 17 వేల 9 వంద‌ల 89 కోట్ల‌తో 13 జిల్లాల‌కు తాగునీటిని ఇచ్చేందుకు ప్ర‌ణాళిక ర‌చించారు. 1200 కోట్ల అంచ‌నాల‌తో, జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కంలో భాగంగా 200 కోట్లు కేంద్రం ఇచ్చేట్టు జీవోలో పేర్కొన్నారు. కేసీఆర్, జ‌గ‌న్ త‌మ స‌త్సంబంధాల కార‌ణంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చి విందు భోజ‌నాలు చేసి ఆ త‌ర్వాత కేసీఆర్ రాయ‌ల‌సీమ‌కు వెళ్లి చేప‌ల పులుపు తిన్న సంద‌ర్భంలో ఈ జీవో వ‌చ్చింది అని సీఎం గుర్తు చేశారు.

అనుమ‌తులు, ఆర్థిక సాయం ఆశించిన‌ప్పుడు అడ్డుప‌డ‌లేదు

కేఆర్ఎంబీ కానీ, కేంద్ర ప్ర‌భుత్వం గ్రాంట్ ఇవ్వొద్ద‌ని బీఆర్ఎస్ నేత‌లు అభ్యంత‌రం చెప్ప‌లేదు. ఈ అనుమ‌తుల కొన‌సాగింపులో భాగంగానే నాగార్జున సాగ‌ర్ కింద ప‌నులు జ‌రుగుతున్నాయి. అనుమ‌తులు, ఆర్థిక సాయం ఆశించిన‌ప్పుడు అడ్డుప‌డ‌లేదు. మీరు ఆనాడు ఇచ్చిన అలుసుతో ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభ ద‌శ‌కు వ‌చ్చింది. అంతేకాదు.. ఒక వేళ త‌మ ప్ర‌భుత్వం రాక‌పోతే ప్రాజెక్టు ఆగిపోతుంద‌నే భయంతో 2024లోనే పూర్తి చేయాల‌ని జీవోలో పేర్కొన్నార‌ని సీఎం తెలిపారు.

కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు

ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్‌పై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయ‌డ‌మే కాకుండా, స్వ‌యంగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఏపీ సీఎస్‌కు ఫోన్ చేసి.. అభ్యంత‌ర ప్రాజెక్టుల‌ను నిర్మాణం చేస్తే.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య భంగం క‌లుగుతుంద‌ని చెప్పారు. తాజాగా జ‌రుగుతున్న వివాదానికి సంబంధించిన ఆధారాలు మీ ముందు పెడుతున్నాం. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. మా చిత్త‌శుద్ధిని ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం లేదు అని సీఎం స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement