త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Raids | కీస‌ర ఇన్‌స్పెక్టర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..

ACB Raids | కీసర పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అర్కపల్లి ఆంజనేయులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. సిటీ రేంజ్‌-1 అధికారులు శనివారం (అక్టోబర్‌ 17) ఆయన నివాసం, కార్యాలయంతోపాటు బంధువులు, సహచరులు, బినామీలకు సంబంధించిన మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

P

Telangana | Published On Oct 17, 2026, 8.43 pm IST

ACB Raids | కీస‌ర ఇన్‌స్పెక్టర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..
Advertisement

ACB Raids | కీసర పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అర్కపల్లి ఆంజనేయులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. సిటీ రేంజ్‌-1 అధికారులు శనివారం (అక్టోబర్‌ 17) ఆయన నివాసం, కార్యాలయంతోపాటు బంధువులు, సహచరులు, బినామీలకు సంబంధించిన మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2.28 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

సోదాల్లో సరూర్‌నగర్‌ లింగోజిగూడలో రెండు ప్లాట్లు, ఎల్‌బీనగర్‌ మన్సూరాబాద్‌లో ఇల్లు, పెరూర్‌లో నిర్మాణంలో ఉన్న ఇల్లు, మిర్యాలగూడ హాలియాలో వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు కాగా, మరికొన్ని వ్యవసాయ భూములు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. వీటి మార్కెట్‌ విలువ అధికారిక అంచనాల కంటే ఎక్కువగా ఉండే అవ‌కాశం ఉంద‌ని ఏసీబీ వ‌ర్గాలు తెలిపాయి. అలాగే రూ.7 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలు, రూ.6.50 లక్షల విలువైన కారు, రూ.10 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు గుర్తించారు. అదనపు ఆస్తులపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఆంజనేయులు గతంలోనూ లంచం కేసులో పట్టుబడ్డారు. అధికారిక పని చేసేందుకు రూ.8 లక్షలు డిమాండ్‌ చేసి, తన కింద పనిచేసే కీసర ఎస్‌ఐ డీ జ్ఞానేందర్‌ రెడ్డి ద్వారా రూ.5 లక్షలు తీసుకుంటుండగా సెప్టెంబర్‌ 16న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెప్టెంబర్‌ 17న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ప్రస్తుతం చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఉన్నారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ ఆయనను పీటీ వారెంట్‌పై కోర్టులో హాజరుపరచనున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement
Advertisement