Speaker Om Birla | లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. 10 గంటలపాటూ కొనసాగనున్న చర్చ
Speaker Om Birla | లోక్‌సభ (Lok Sabha) స్పీకర్ ఓం బిర్లాపై (Speaker Om Birla) విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ (Congress MP Mohammed Jawed) సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ ప్రారంభించారు.
Speaker Om Birla | పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నేడు లోక్‌సభ (Lok Sabha) స్పీకర్ ఓం బిర్లాపై (Speaker Om Birla) విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ (Congress MP Mohammed Jawed) సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ ప్రారంభించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటల సమయం కేటాయించారు.
సభలో గందరగోళం..
ఈ అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభా కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తున్నఎంపీ జగదాంబికా పాల్.. ఓం బిర్లా ఉదారతను ప్రశంసించారు. అయితే, దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఎంపీల ఆందోళన మధ్యే అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. పది గంటలపాటూ ఈ చర్చ కొనసాగనుంది. అనంతరం దీనిపై ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే సాధారణ మెజార్టీ అయిన 272 ఓట్లు కావాలి. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 293 సంఖ్యాబలం ఉంది. ప్రతిపక్షాలకు 238 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో సభలో ఈ తీర్మానం వీగిపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. ఈ సందర్భంగా చైనా అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే (Ex Army chief General MM Naravane) తన పుస్తకంలో రాసుకున్న కొన్ని అంశాలను రాహుల్ తన ప్రసంగంలో ప్రస్తావించడంతో లోక్‌సభలో గందరోగళం తలెత్తిన విషయం తెలిసిందే. రాహుల్ ప్రసంగాన్ని అధికార పక్షం ఎంపీలు అడ్డుకోవడంపై కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సభలో పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. దీంతో ఎనిమిది మంది ఎంపీలను స్పీకర్ సెషన్ మొత్తం సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. రాజ్యాంగంలోని 94సీ ప్రకారం.. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాసం నోటీసులపై 118 మంది ఎంపీలు సంతకాలు చేశారు.
Also Read..
BCCI | టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. రూ.131 కోట్ల నగదు బహుమతి..
రంగాల వారిగా గ్యాస్ సరఫరా కేటాయింపులను ప్రకటించిన కేంద్రం
8వ తరగతి బుక్‌లో వివాదాస్పద అధ్యాయంపై క్షమాపణలు చెప్పిన ఎన్‌సీఈఆర్‌టీ
సంబంధిత వార్తలు

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక..
మే 19, 2026

Kanimozhi | కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. సభలో వారిపక్కన కూర్చోం.. ఓంబిర్లాకు డీఎంకే లేఖ
మే 8, 2026

Women Reservation | మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రధాని మోదీకి లేఖ రాయనున్న ప్రతిపక్షాలు..!
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



