Saroornagar Yuva Sangrama Sadassu | సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
Saroornagar Yuva Sangrama Sadassu | హైదరాబాద్‌లోని సరూర్‌గర్ స్టేడియంలో రేపు నిర్వహించనున్న బీఆర్ఎస్ 'యువ సంగ్రామ సదస్సు'కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో బీఆర్‌ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.
Saroornagar Yuva Sangrama Sadassu | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని సరూర్‌గర్ స్టేడియంలో రేపు నిర్వహించనున్న బీఆర్ఎస్ 'యువ సంగ్రామ సదస్సు'కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో బీఆర్‌ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. 17 రోజులుగా సభకు అనుమతి ఇచ్చే విషయంలో నిర్ణయం ఎందుకు తీసుకోలేదంటూ న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. ఈ మేరకు కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. శాంతియుతంగా సదస్సు నిర్వహించుకోవాలని ఆ పార్టీకి స్పష్టం చేసింది. రహదారుల దిగ్బంధం, రెచ్చగొట్టే విధానం ఉండొద్దని హైకోర్టు సూచించింది. సభ నిర్వహణకు అనుమతి లభించడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాట్లను ముమ్మరం చేశాయి.

బీఆర్ఎస్ పార్టీ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా శాంతిభద్రతల సమస్యల తలెత్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉందని హోంశాఖ జీపీ మహేశ్ రాజే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సదస్సు నిర్వహించే ప్రాంతంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు లేవని కోర్టుకు తెలిపారు. అయితే సమస్య ఉంటే దరఖాస్తుదారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది. సరైన స్పందన రాకపోవడంతో అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ రేపు ఈ సభను ఏర్పాటు చేసింది. నిరుద్యోగ యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో ఈ సదస్సుకు హాజరు కావాలని బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికే పిలుపునిచ్చారు. కాగా ఈ తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ నేతలు అభివర్ణిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | స్టీల్ బ్యాంక్ పర్యావరణ విప్లవంతో పచ్చ హుస్నాబాద్ సాకారం
జులై 17, 2026

FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్.. తెల్లారి 4.30 వరకు బార్లు, క్లబ్బులు తెరిచే ఉంటాయ్..
జులై 17, 2026

Employees Health Scheme | ‘ఈహెచ్ఎస్’ పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్
జులై 17, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | స్టీల్ బ్యాంక్ పర్యావరణ విప్లవంతో పచ్చ హుస్నాబాద్ సాకారం
- ●FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్.. తెల్లారి 4.30 వరకు బార్లు, క్లబ్బులు తెరిచే ఉంటాయ్..
- ●Rakul Preet Singh | టాలీవుడ్ హీరోలపై రకుల్ పొగడ్తలు - ఆఫర్ల కోసమే అంటోన్న నెటిజన్లు|
- ●Minister Vivek | 15 ఏండ్ల తర్వాత ఈఎస్ఐలో భారీ నియామకాలు
- ●Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరు..
- ●Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు

Ponnam Prabhakar | స్టీల్ బ్యాంక్ పర్యావరణ విప్లవంతో పచ్చ హుస్నాబాద్ సాకారం

FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్.. తెల్లారి 4.30 వరకు బార్లు, క్లబ్బులు తెరిచే ఉంటాయ్..

Rakul Preet Singh | టాలీవుడ్ హీరోలపై రకుల్ పొగడ్తలు - ఆఫర్ల కోసమే అంటోన్న నెటిజన్లు|

Minister Vivek | 15 ఏండ్ల తర్వాత ఈఎస్ఐలో భారీ నియామకాలు



