Rakul Preet Singh | టాలీవుడ్ హీరోలపై రకుల్ పొగడ్తలు – ఆఫర్ల కోసమే అంటోన్న నెటిజన్లు|
టాలీవుడ్‌తో పాటు తెలుగు స్టార్ హీరోలపై రకుల్ ప్రీత్ సింగ్ పొగడ్తలు కురిపిస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్ బెస్ట్ అని, తెలుగు ఇండస్ట్రీకి ఏది సాటి రాదని అన్నది. టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య అస్సలు పోటీతత్వం కనిపించదని, యూనిటీగా ఉంటారని చెప్పింది.
Entertainment | Published On Jul 17, 2026, 4.30 pm IST
Rakul Preet Singh |ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది రకుల్ ప్రీత్ సింగ్. మహేష్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. రకుల్ ప్రీత్‌సింగ్‌ను టాలీవుడ్ దర్శకనిర్మాతలు దాదాపు మర్చిపోయారు. ఈ బ్యూటీ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి ఐదేళ్లు దాటిపోయింది.
తెలుగు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది.
పొగడ్తలు...
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమతో పాటు ఇక్కడి హీరోలను తెగ పొగిడేసింది. టాలీవుడ్‌లో అసూయ, పోటీతత్వం అస్సలు కనిపించవని అన్నది. టాలీవుడ్‌లోని నటీనటులు, దర్శకులతో పాటు ఇతర సాంకేతిక నిపుణుల మధ్య చక్కటి యూనిటీ ఉంటుందని, అందరూ ఒకే మాట మీద నిలబడతారని రకుల్ ప్రీత్ సింగ్ అన్నది. బాలీవుడ్‌తో పాటు మిగిలిన ఇండస్ట్రీలలో తాను ఆ ఐకమత్యాన్ని చూడలేదని రకుల్అ న్నది.
అల్లు అర్జున్...మహేష్‌బాబు...
"టాలీవుడ్‌లో పోటీతత్వం చాలా తక్కువగా కనిపిస్తుంది. నా సినిమా హిట్టయితే చాలానే భావన ఏ హీరో, దర్శకుడిలో కనిపించదు వ్యక్తిగత సక్సెస్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ బాగుండాలి, టాలీవుడ్‌కు గొప్ప పేరు తీసుకురావాలనే ఆలోచన విధానం అల్లు అర్జున్, మహేష్‌బాబులాంటి స్టార్స్‌లో గమనించా. మంచి సినిమా ఎవరూ చేసినా మెచ్చుకుంటుంటారు. ఒకరికొకరు సపోర్ట్‌గా నిలుస్తుంటారు. కెరీర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది. భాష తెలియదు. ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లు ఎవరూ లేరు. అయినా కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ నా సొంత ఇండస్ట్రీలా మారిపోయింది" అని రకుల్ తెలిపింది.
టాలీవుడ్ బెస్ట్...
"బాలీవుడ్‌తో పాటు మిగిలిన పరిశ్రమల్లో సినిమాల చేశా. టాలీవుడ్‌కు భిన్నమైన వాతావరణం ఈ ఇండస్ట్రీలో కనిపించింది. హీరోలు, దర్శకులు ఎవరికి వారే అన్నట్లుగా ఉంటారు. యూనిటీ, స్పోర్టివ్ కల్చర్ చాలా తక్కువ. నేను పనిచేసిన ఇండస్ట్రీలలో టాలీవుడ్ బెస్ట్" అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది.
ఆఫర్ల కోసమే...
ఆఫర్ల కోసమే రకుల్ ప్రీత్‌సింగ్ టాలీవుడ్‌పై పొగడ్తలు కురిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లతో బాలీవుడ్‌లో ఈ అమ్మడి కెరీర్ క్లోజయ్యింది. దాంతో తిరిగి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని రకుల్ ప్లాన్ చేస్తోన్నట్లు వార్తలొస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu OTT | ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజైన తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ మూవీ
జులై 17, 2026

Aishwarya Rajesh | హీరోయిన్ రోల్స్ బోర్ కొట్టాయి – విలన్‌గా నటించాలనుంది – ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
జులై 16, 2026

Adinath Kothare | 15 ఏళ్ల దాంపత్యానికి తెర.. విడాకులు తీసుకున్న రామాయణ నటుడు..!
జులై 16, 2026
తాజావార్తలు
- ●Saroornagar Yuva Sangrama Sadassu | సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
- ●Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరు..
- ●Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు
- ●Employees Health Scheme | 'ఈహెచ్ఎస్' పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్
- ●Women's Hockey WC | మహిళల హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా సలీమా టెటే
- ●CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..

Saroornagar Yuva Sangrama Sadassu | సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరు..

Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు

Employees Health Scheme | 'ఈహెచ్ఎస్' పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్



