Bengaluru Rain | బెంగళూరులో భారీ వర్షం.. వాన నీటిలో ఆడిన ఆర్సీబీ ప్లేయర్.. వీడియో
Bengaluru Rain | బెంగళూరులో అకాల వర్షం బీభత్సం (Bengaluru Rain) సృష్టించింది. బుధవారం సాయంత్రం నగర వ్యాప్తంగా వడగండ్ల వాన దంచికొట్టింది. ఈదురుగాలుల ధాటికి వందలాది చెట్లు నేలకొరిగాయి.
Bengaluru Rain | త్రినేత్ర.న్యూస్: బెంగళూరులో అకాల వర్షం బీభత్సం (Bengaluru Rain) సృష్టించింది. బుధవారం సాయంత్రం నగర వ్యాప్తంగా వడగండ్ల వాన దంచికొట్టింది. ఈదురుగాలుల ధాటికి వందలాది చెట్లు నేలకొరిగాయి. రోడ్లపై ఎక్కడిక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. ఓ దవాఖాన ప్రహరీ గోడ కూలి ఏడుగురు చనిపోయారు.
మరోవైపు ఒక్కసారిగా వర్షం కురవడంతో మాజీ క్రికెటర్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్‌తోపాటు (Venkatesh Prasad), ఆర్సీబీ స్టార్ ప్లేయార్ టిమ్ డేవిడ్ (Tim David) చిన్నపిల్లాడిలా మారిపోయారు. బుధవారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న వెంకటేశ్ ప్రసాద్ రాళ్ల వానను చూసి మురిసిపోయారు. తన కారును ఆపి కిందికి దిగి రోడ్డుపై పడిన రాళ్లను దోసిట్లో పోసుకుని మురిసిపోయారు.
Everyone’s posting aesthetic versions of Bengaluru’s first summer rain. This one’s always our favourite. ❤️😉 pic.twitter.com/oFFg888Uw1
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 29, 2026
అదేవిధంగా ఐపీఎల్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ (RCB) జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నది. ఈ క్రమంలో వాన కురవడంతో గ్రౌడ్‌లో కవర్స్ కప్పారు. వీటిపై నీళ్లు నిలిచిపోవడంతో.. క్రికెటర్ టిమ్ డేవిడ్ వాటిలో ఈత కొడుతూ, వర్షంలో తడుస్తూ కొద్దిసేపు ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను ఆర్సీబీ ఎక్స్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు?.. అందులో తడవాలని ఎవరు అనుకోరు?.. చెప్పండి.. వాళ్లు చిన్నపిల్లలైనా.. బడా పారిశ్రామిక వేత్తలైనా.. ప్రముఖులైనా..?
Bengaluru rain made even KSCA president Venkatesh Prasad a kid😄#BengaluruRains pic.twitter.com/AzV8u81QMd
— Sree Harsha (@AapathBandhava) April 29, 2026
సంబంధిత వార్తలు

Tim David | టిమ్ డేవిడ్‌కు షాక్.. 30శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించిన ఐపీఎల్..!
మే 12, 2026

Sunil Gavaskar | ఐపీఎల్ ఫైనల్లో ఆడేది ఈ రెండు జట్లే.. సునీల్ గవాస్కర్ జోస్యం
మే 11, 2026

IPL 2026 Playoffs Schedule | ఐపీఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. అహ్మదాబాద్‌లో 31న ఫైనల్..!
మే 6, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



