త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | డిగ్రీ అర్హ‌త‌తో ఆర్బీఐలో ఉద్యోగాలు.. నెల‌కు రూ. 1.50 వేలు జీతం

RBI | మీరు డిగ్రీ( Degree ) పూర్తి చేశారా..? ప్ర‌భుత్వ కొలువు( Govt Job ) కోసం ఎదురుచూస్తున్నారా..? అది కూడా బ్యాంకు ఉద్యోగం( Bank Job ) చేయాల‌నుకుంటున్నారా..? ఇంకేందుకు ఆల‌స్యం.. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank of India )లో ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్ వెలువడింది.. ఆ వివ‌రాలు మీ కోసం.

S

National | Published On Apr 29, 2026, 1.45 pm IST

RBI | డిగ్రీ అర్హ‌త‌తో ఆర్బీఐలో ఉద్యోగాలు.. నెల‌కు రూ. 1.50 వేలు జీతం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్ : దేశంలోనే అతిపెద్ద బ్యాంకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ వెలువ‌డింది. బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్య‌ర్థులు.. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

పోస్టుల వివ‌రాలు :

గ్రేడ్ B DR(జ‌నర‌ల్ ఆఫీస‌ర్స్‌) - 40
గ్రేడ్ B DPER(డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక‌నామిక్స్ అండ్ పాల‌సీ రీసెర్చ్ ఆఫీస‌ర్స్) - 10
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ మేనేజ్‌మెంట్‌(DSIM) గ్రేడ్ B(DR) ఆఫీస‌ర్లు - 10

ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ఆన్‌లైన్ ద్వారా 3 విధానాల్లో ప‌రీక్ష‌

ప్రిలిమిన‌రీ ఎగ్జామ్(గ్రేడ్ B(DR) జ‌న‌ర‌ల్‌కు మాత్ర‌మే)
మెయిన్స్
ఇంట‌ర్వ్యూ

ప‌రీక్ష తేదీ :

జ‌న‌ర‌ల్ - ఫేజ్1(జూన్ 13, 2026), ఫేజ్‌2(జులై 25, 2026)
DEPR/DSIM - ఫేజ్1(జూన్ 14, 2026), ఫేజ్‌2(జులై 26, 2026)

వేత‌నం :

నెల‌కు రూ. 1,50,374
వ‌య‌సు :
21 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి(ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేండ్లు, ఓబీసీల‌కు 3 ఏండ్లు సడ‌లింపు)

ద‌ర‌ఖాస్తు ఫీజు

జ‌న‌ర‌ల్ /ఓబీసీ /ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ. 850+18 శాతం జీఎస్టీ
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్య‌ర్థుల‌కు రూ. 100+18 శాతం జీఎస్టీ
ఆర్బీఐ స్టాఫ్‌కు ఎలాంటి ఫీజు లేదు

ముఖ్య‌మైన తేదీలు :

ద‌ర‌ఖాస్తు ప్రారంభ తేదీ : ఏప్రిల్ 29, 2026
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ : మే 20, 2026(సాయంత్రం 6 గంట‌ల‌కు)

వెబ్‌సైట్ : https://rbi.org.in/

Advertisement
Advertisement