Ram Mandir Donations Row | ఆకాశమేమీ విరిగిపడదు.. రామమందిర విరాళాల కేసుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
Ram Mandir Donations Row | అయోధ్య (Ayodhya) రామ మందిరంలో కానుకల దుర్వినియోగం, నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం (PIL)పై సుప్రీంకోర్టులో (Supreme Court) ఇవాళ విచారణ జరిగింది. పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Ram Mandir Donations Row | అయోధ్య (Ayodhya) రామ మందిరంలో భక్తులు సమర్పించుకున్న విరాళాల (Donations) చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రామాలయం కానుకల దుర్వినియోగం, నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం (PIL)పై సుప్రీంకోర్టులో (Supreme Court) ఇవాళ విచారణ జరిగింది. పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఆలయ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని దీనిపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. అయితే, ఈ వ్యవహారంలో అంత అత్యవసర పరిస్థితి ఏముందని జస్టిస్ సుందరేష్ ప్రశ్నించారు. దీనికి పిటిషనర్ సమాధానమిస్తూ.. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం డీల్ చేస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వాదనలు విన్న కోర్టు.. తక్షణమే విచారణ జరపాలన్న విజ్ఞప్తిని నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత కోర్టు సాధారణ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ఈ కేసును విచారిస్తే ఆకాశమేమీ విరిగిపడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వేసవి సెలవుల తర్వాత వెకేషన్ బెంచ్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై జులై 12-17తేదీల మధ్య విచారణ చేపడ్తామని పేర్కొంది.
అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలను చోరీ చేసిన కేసులో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశారు. కానుకల లెక్కింపు విభాగంలో పనిచేస్తున్న అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రమాశంకర్ (టిన్నూ యాదవ్) లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. సీసీటీవీ కెమెరాల్లో వీరంతా విరాళాలను కాజేస్తూ స్పష్టంగా దొరికిపోయారు. ఇప్పటివరకూ దాదాపు రూ. 7.75 కోట్ల విరాళాలు దారిమళ్లినట్లు అంచనా వేయగా, పోలీసుల దాడుల్లో కేవలం రూ. 80 లక్షలు మాత్రమే రికవరీ అయ్యాయి. ఈ వ్యవహారంపై ఆలయ ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra) జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ (Champat Rai) నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే రాజీనామా చేశారు. ఈ స్కామ్ వ్యవహారం ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దృష్టికి వెళ్లడంతో.. ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు టెంపుల్ కన్‌స్ట్రక్షన్ కమిటీ హెడ్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●NRI | విదేశాల్లోని భారతీయులు ఇక్కడికి డబ్బు పంపిస్తే జాగ్రత్త.. రూల్స్‌ను పాటించకపోతే నోటీసులు ఇస్తారు..
- ●Telangana student | స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
- ●Suicide | ‘సర్’ జాబితాలో పేరు లేదని భయం.. జైలుకు పంపిస్తారేమోనని వ్యక్తి ఆత్మహత్య
- ●Heavy Rain | మళ్లీ మునిగిన ముంబై.. అస్సాంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్.. అరుణాచల్‌తో తొమ్మిది మంది గల్లంతు
- ●Vijayabhaskar Resign to AIADMK | పళనిస్వామికి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా
- ●Airtel | జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. భారీగా పెరిగిన కొత్త సబ్స్క్రైబర్లు..

NRI | విదేశాల్లోని భారతీయులు ఇక్కడికి డబ్బు పంపిస్తే జాగ్రత్త.. రూల్స్‌ను పాటించకపోతే నోటీసులు ఇస్తారు..

Telangana student | స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

Suicide | ‘సర్’ జాబితాలో పేరు లేదని భయం.. జైలుకు పంపిస్తారేమోనని వ్యక్తి ఆత్మహత్య

Heavy Rain | మళ్లీ మునిగిన ముంబై.. అస్సాంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్.. అరుణాచల్‌తో తొమ్మిది మంది గల్లంతు






