Meenakshi Natarajan | తెలంగాణలో నాకు ఎవరి సీటూ వద్దు.. అంత అవసరం లేదు కూడా
Meenakshi Natarajan | తెలంగాణలో ఎవరూ నాకోసం రాజ్యసభ స్థానం వదులుకోవడం లేదని.. అలా రాజీనామా చేయించి తీసుకునే అవసరం అంతకన్నా నాకు లేదని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పారు. తన రాజకీయం మధ్యప్రదేశ్‌లోనే ఉంటుందని స్పష్టం చేశారు.
- నాపై ఎలాంటి కేసులు లేవ్
- రిటర్నింగ్ అధికారులు, ఎలక్షన్ కమిషన్ కాంప్రమైస్ అయ్యారు
- పార్టీలో కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు
- ఆ వార్తలన్నీ అబద్దం
- తేల్చి చెప్పిన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్
Meenakshi Natarajan | త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో ఎవరూ నాకోసం రాజ్యసభ స్థానం వదులుకోవడం లేదని.. అలా రాజీనామా చేయించి తీసుకునే అవసరం అంతకన్నా నాకు లేదని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పారు. నా నామినేషన్ తిరస్కరణపై ఎలాంటి కుట్రలు జరగలేదన్నారు. తనపై వచ్చిన వార్తలన్నీ పూర్తి గా అవస్తవమని ఆమె కొట్టిపారేశారు. తన రాజకీయం మధ్యప్రదేశ్‌లోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం గాంధీ భవన్‌లో జరిగిన ఓబీసీ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం సందర్భంగా ఆమె మాట్లాడారు.
ఫాల్స్ కేసులు కూడా ఫైల్ చేస్తారు..
పార్టీలో కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. నామినేషన్ తిరస్కరణపై నేను ఇప్పటివరకు తక్కువగా మాట్లాడాను. ఈ ఇష్యూ కోర్టులో ఉందని మాట్లాడలేదు. మధ్యప్రదేశ్‌లో 3 స్థానాలు ఖాళీగా ఉండే. ఒక్క స్థానానికి 58 సభ్యులు కావాలి. కాంగ్రెస్‌కి బలం ఉంది కాబట్టే నాకు టికెట్ ఇచ్చారు. కానీ బీజేపీకి మూడో స్థానానికి అవకాశం లేకపోయిన నామినేషన్ వేశారు. ఫౌల్ గేమ్ ప్లాన్ చేసే బీజేపీ మూడో నామినేషన్ వేశారు. డబ్బులతో, బెదిరింపులతో మూడో స్థానం రాదని బీజేపీ గ్రహించింది. నా ఇష్యూలో రిటర్నింగ్ ఆఫీసర్స్ కాంప్రమైస్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ కాంప్రమైస్ అయ్యింది. ఫాల్స్ కేసులు కూడా కోర్టులో ఫైల్ చేస్తారు అని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

నాపై క్రిమినల్ కేసులు లేవు. కేవలం నోటీసు ఇచ్చారు. కేసు ఇంకా ప్రాథమిక విచారణ దశలోనే ఉంది. ఫామ్ 26లో ఇలాంటి కేసులు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను రిటర్నింగ్ అధికారి అడిగిన్నపుడు ఉందని చెప్పాను.. కానీ అప్పటికీ కేసు ఎఫ్ఐఆర్ కాలేదు. ఆ కేసు 2016కు సంబంధించింది. నేను ఇన్‌ఛార్జ్‌గా వెళ్లకముందు కేసు అని చెప్పాను అని మీనాక్షి వివరించారు.
ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది..
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంప్రమైస్ అయిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అంటే టెక్నికల్‌గా ఎలక్షన్ కమిషన్ రాజ్యసభ సభ్యులుగా సర్టిఫికెట్స్ ఇచ్చారు. మీరు ఎలక్షన్ కమిషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. కుంభం శివకుమార్ ఇష్యూలో కేసు సీరియస్ అని గ్రహించి నారాయణపేట టికెట్ ఇవ్వలేదు. కుంభం శివకుమార్‌పై ఎలాంటి కేసు ప్రూవ్ కాలేదు. ఛార్జ్ షీట్ లేదు. ఒక వ్యక్తి పై ఉన్న అభియోగాలకు కుటుంబంలోని వారికి టికెట్ ఇవ్వకూడదని ఎక్కడ లేదు. రాజ్యసభ తిరస్కరణ విషయంలో మేం ఒక్క నిమిషం కూడా నిరాశ చెందలేదు. ఎందుకంటే బీజేపీ ఎలాంటి రాజకీయం చేసిందో దేశానికి చూపించాం అని మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్, అభిషేక్ సింఘ్వి విషయంలో అలా జరిగింది..
రెండేళ్ల నుండి రాహుల్ గాంధీ చెబుతూనే ఉన్నారు ఓటు చోరీ, సీట్ చోరీ జరుగుతోందని. ఎవరు ఎందుకు లీక్ చేస్తారు. కాంగ్రెస్‌కి ఉంది ఒక్క సీటే. నేనే ఆర్వోకి చెప్పాను. ఆర్వోలు బీజేపీకి కంప్రమైస్ అయ్యి చేశారు. ఈ పుకార్లు నామినేషన్ తిరస్కరణకు ఒక్క రోజు ముందు నుండే బీజేపీ ప్రచారం చేస్తుంది. మాకు ప్రతి సీటు, సభ్యుడు ముఖ్యమే. కొన్ని సమయాల్లో మాత్రమే అలా అవుతుంది. దేశం కోసం అవసరమైన్నపుడే అలా జరుగుతోంది. మన్మోహన్ సింగ్, అభిషేక్ సింఘ్వి విషయంలో అవసరం కాబట్టి జరిగింది అని మీనాక్షి వెల్లడించారు.
ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bhagyashri Borse | టాలీవుడ్ హీరోతో భాగ్యశ్రీ బోర్సే సీక్రెట్ లవ్‌స్టోరీ - హింట్ ఇచ్చేసిన యాంకర్ సుమ
- ●Niranjan Reddy | ఎస్బీఐ భూముల వేలంలో ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోంది
- ●Maa Inti Bangaram | సమంత మా ఇంటి బంగారం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Yoga | యోగా వేడుకల్లో అటవీ సిబ్బంది.. ప్రత్యేక ఆకర్షణగా ఏనుగులు.. వీడియో
- ●Ramchandar Rao | హామీలిచ్చుడే తప్ప..ఎప్పుడైనా నెరవేర్చారా? : రాంచందర్ రావు
- ●FIFA World Cup 2026 | జపాన్ మ్యాజిక్.. 4-0 తేడాతో ట్యునీషియా చిత్తు

Bhagyashri Borse | టాలీవుడ్ హీరోతో భాగ్యశ్రీ బోర్సే సీక్రెట్ లవ్‌స్టోరీ - హింట్ ఇచ్చేసిన యాంకర్ సుమ

Niranjan Reddy | ఎస్బీఐ భూముల వేలంలో ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోంది

Maa Inti Bangaram | సమంత మా ఇంటి బంగారం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Yoga | యోగా వేడుకల్లో అటవీ సిబ్బంది.. ప్రత్యేక ఆకర్షణగా ఏనుగులు.. వీడియో




