Suicide | ‘సర్’ జాబితాలో పేరు లేదని భయం.. జైలుకు పంపిస్తారేమోనని వ్యక్తి ఆత్మహత్య
Suicide | హైదరాబాద్ బోరబండలో ఘోరం జరిగింది. ‘సర్’ జాబితాలో తన పేరు లేదన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Suicide | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ బోరబండలో ఘోరం జరిగింది. ‘సర్’ జాబితాలో తన పేరు లేదన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని, జైలుకు కూడా పంపిస్తారేమోనని తీవ్ర భయాందోళనకు గురై షేక్ ముజీబుర్ రెహ్మాన్ (51) అనే వ్యక్తి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
కుటుంబ సభ్యలు వివరాల ప్రకారం.. బోరబండ భరత్‌నగర్‌కు చెందిన షేక్ ముజీబ్ కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు మానసిక వికలాంగులైన పిల్లలు ఉన్నారు. సర్ జాబితాలో తన పేరు లేకపోవడంతో రెహ్మాన్ భయాందోళనకు గురయ్యారు. ఇంటింటి ఓటర్ల సర్వే (SIR) లో తన పేరు లేకపోవడంతో పాటు తన కుటుంబానికి వస్తున్న సంక్షేమ పథకాలు, పింఛన్లు ఆగిపోతాయని, తనను జైలుకు పంపిస్తారేమోనని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తమను ప్రభుత్వం ఆదుకోవాలని మృతుడి భార్య రెహ్మాన్ కోరుతున్నారు.
ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సర్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్.. కొత్త ప్రొడక్ట్స్, భారీ డిస్కౌంట్లు..
- ●Tollywood | తెలుగు సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ చెల్లెలు - హారర్ కామెడీ సీక్వెల్లో ఛాన్స్!
- ●DigiLocker | ఇక డిజిలాకర్‌లో విద్యుత్ బిల్లులు కూడా.. సులభంగా భద్రపరుచుకోవచ్చు..
- ●NRI | విదేశాల్లోని భారతీయులు ఇక్కడికి డబ్బు పంపిస్తే జాగ్రత్త.. రూల్స్‌ను పాటించకపోతే నోటీసులు ఇస్తారు..
- ●Telangana student | స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
- ●Heavy Rain | మళ్లీ మునిగిన ముంబై.. అస్సాంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్.. అరుణాచల్‌తో తొమ్మిది మంది గల్లంతు

Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్.. కొత్త ప్రొడక్ట్స్, భారీ డిస్కౌంట్లు..

Tollywood | తెలుగు సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ చెల్లెలు - హారర్ కామెడీ సీక్వెల్లో ఛాన్స్!

DigiLocker | ఇక డిజిలాకర్‌లో విద్యుత్ బిల్లులు కూడా.. సులభంగా భద్రపరుచుకోవచ్చు..

NRI | విదేశాల్లోని భారతీయులు ఇక్కడికి డబ్బు పంపిస్తే జాగ్రత్త.. రూల్స్‌ను పాటించకపోతే నోటీసులు ఇస్తారు..






