త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana student | స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

Telangana student | స్పెయిన్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి (Telangana student) అనుమానాస్ప‌ద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.

D

Telangana | Published On Jun 29, 2026, 2.02 pm IST

Telangana student | స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
Advertisement

Telangana student | స్పెయిన్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి (Telangana student) అనుమానాస్ప‌ద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. వేలెన్సియా (Valencia) న‌గ‌రంలో భ‌వనంపై నుంచి ప‌డి మృతి చెందాడు. మృతుడు పెద్ద‌ప‌ల్లి జిల్లా కాల్వ శ్రీ‌రాంపూర్ మండ‌లం కూనారం గ్రామానికి చెందిన గీట్ల సాయి అఖిల్ రెడ్డి (30)గా గుర్తించారు.

సాయి ఫ్యామిలీ హైద‌రాబాద్‌లో నివాసం ఉంటోంది. పైచ‌దువుల కోసం సాయి ఆరు నెల‌ల క్రితం స్పెయిన్ వెళ్లారు. అక్క‌డ వేలెన్సియా న‌గ‌రంలో నివాసం ఉంటూ హోట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సు చ‌దువుతున్నాడు. ఈ క్ర‌మంలో ఆదివారం తాను నివ‌సిస్తున్న భ‌వనం ఒక‌టో అంత‌స్తు బాల్క‌నీ నుంచి అత‌డు అనుమానాస్ప‌ద స్థితిలో కింద‌ప‌డి ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్ర‌మాద‌వ‌శాత్తూ జ‌రిగిందా..? లేక మ‌రేదైనా కార‌ణ‌మా..? అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కుమారుడి మ‌ర‌ణ వార్త తెలియ‌గానే సాయి కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి. ఒక్క‌గానొక్క కుమారుడు మృతి చెంద‌డంతో ఆ త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. సాయి మృతికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement