Heavy Rain | మళ్లీ మునిగిన ముంబై.. అస్సాంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్.. అరుణాచల్‌తో తొమ్మిది మంది గల్లంతు
Heavy Rain | రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. . ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించాయి.
Heavy Rain | రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)ని భారీ వర్షం ముంచెత్తింది. ముంబైతో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. కేవలం 4 గంటల వ్యవధిలోనే 100 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇక రాత్రంతా కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సబర్బన్ రైలు సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి అంధేరి సబ్‌వే (Andheri Subway) పూర్తిగా నీట మునిగిపోవడంతో అధికారులు ఆ రూట్లలో వాహనాల రాకపోకలకు నిలిపివేశారు. ఇక నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
వరదలో కొట్టుకుపోయిన ఐరన్ బ్రిడ్జ్..
అస్సాం (Assma)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. వరద ఉద్ధృతికి ధేమాజీ జిల్లాలోని సిమెన్ నదిపై ఉన్న ఓ రైల్వే వంతెన కూలిపోయింది. ఫలితంగా ధేమాజీ జిల్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాదు, ధేమాజీ జిల్లాలో కెమి, ఓయాన్ ప్రాంతాలను అనుసంధానించే కెమి నదిపై ఉన్న 300 మీటర్ల పొడవైన ఐరన్ బ్రిడ్జ్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ వంతెన కొట్టుకుపోవడంతో కెమి-పురాణ జెలోమ్ ప్రాంతం, జోనాయ్ సదర్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అత్యవసర సేవలతోపాటూ నిత్యావసర వస్తువుల సరఫరా ఆగిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Assam: Continuous rainfall has resulted in a flood-like situation in several areas of the Dhemaji district. (28.06) pic.twitter.com/J4I9PrfDmd
— ANI (@ANI) June 29, 2026
తొమ్మిది మంది గల్లంతు..
అటు అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లోనూ భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి పలు నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లాలో సిసిరి నది ఉద్ధృతి కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో తొమ్మిది మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ టీమ్‌కు చెందిన ఓ బోటు కొట్టుకుపోయింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకునేందుకు అధికారులు పడవలను, మూడు ఏనుగులకు ఉపయోగిస్తున్నారు.
తాజావార్తలు
- ●Vijayabhaskar Resign to AIADMK | పళనిస్వామికి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా
- ●Airtel | జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. భారీగా పెరిగిన కొత్త సబ్స్క్రైబర్లు..
- ●Gold Robbery Dubbaka | కాశీకెళ్లింది చూశారు.. కిలో బంగారం ఎత్తుకెళ్లారు
- ●TGSWREIS Recruitment | గురుకులాల్లో 117 పోస్టులు.. దరఖాస్తులకు ముగుస్తున్న గడువు
- ●Pakistan | ఆఫ్గాన్ సరిహద్దులో పాక్ భూతల దాడులు.. 35 మంది మృతి
- ●Credit Score | ఆదాయం ఎక్కువగా ఉన్నా క్రెడిట్ స్కోరు పెరగడం లేదా.. కారణాలు ఇవే..!

Vijayabhaskar Resign to AIADMK | పళనిస్వామికి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా

Airtel | జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. భారీగా పెరిగిన కొత్త సబ్స్క్రైబర్లు..

Gold Robbery Dubbaka | కాశీకెళ్లింది చూశారు.. కిలో బంగారం ఎత్తుకెళ్లారు

TGSWREIS Recruitment | గురుకులాల్లో 117 పోస్టులు.. దరఖాస్తులకు ముగుస్తున్న గడువు






