త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Mataram Bill | వందేమాత‌రం బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం.. విప‌క్ష స‌భ్యుల వాకౌట్‌

Vande Mataram Bill | జాతీయ గీతం ‘జనగణమన..’ స్థాయిలో జాతీయ గేయం వందేమాతరానికి చట్టపరమైన రక్షణలు కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన‌ వందేమాత‌రం బిల్లు (Vande Mataram Bill 2026)కు రాజ్య‌స‌భ (Rajya Sabha) ఆమోదం తెలిపింది.

D

National | Published On Jul 29, 2026, 4.45 pm IST

Vande Mataram Bill | వందేమాత‌రం బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం.. విప‌క్ష స‌భ్యుల వాకౌట్‌
Advertisement

Vande Mataram Bill | జాతీయ గీతం ‘జనగణమన..’ స్థాయిలో జాతీయ గేయం వందేమాతరానికి చట్టపరమైన రక్షణలు కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన‌ వందేమాత‌రం బిల్లు (Vande Mataram Bill 2026)కు రాజ్య‌స‌భ (Rajya Sabha) ఆమోదం తెలిపింది. ఈ బిల్లును జులై 24న కేంద్రం ఎగువ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ స‌హా విప‌క్షాలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. బిల్లు వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ఆరోపించాయి.

ఈ బిల్లుపై చ‌ర్చ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీలు పాల్గొన‌లేదు. నీట్ పేప‌ర్ లీక్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై పోలీసుల చ‌ర్య‌ల‌కు నిర‌స‌న‌గా పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స‌భ‌కు వ‌చ్చి ప్ర‌క‌ట‌న చేయాల‌ని విప‌క్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు స‌భ‌లో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చర్చలో పాల్గొనాలని సభ్యులను డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్ పదే పదే కోరినప్పటికీ ఆందోళనలు విరమించలేదు.

ప్ర‌తిప‌క్ష ఎంపీల నిర‌స‌నల‌ మ‌ధ్యే ఈ బిల్లుపై కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథ‌వాలే త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. ఆ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీల స‌భ్యులు స‌భ నుంచి వాకౌట్ చేశారు. విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న‌ల మ‌ధ్యే ఈ బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స‌మాధానం ఇస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. హ‌స్తం పార్టీ జాతీయ గేయాన్ని అవ‌మానించేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసేట‌ప్పుడు అనేక మంది స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు త‌మ చివ‌రి మాట‌లుగా వందేమాత‌రంను ప‌లికిన సంద‌ర్భాల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు.

వందేమాతరాన్ని పాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా అంతరాయం కలిగించడాన్ని తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణించేలా ఈ బిల్లును స‌వ‌ర‌ణ చేశారు. ఈ చట్టం ప్రకారం.. జాతీయ జెండా, రాజ్యాంగం వంటి జాతీయ చిహ్నాలను అవమానించినా లేదా ఆటంకం కలిగించినా, అగౌరపరిచినా నేరంగా పరిగణించి, గరిష్ఠంగా మూడేండ్ల జైలు శిక్ష, జ‌రిమానా విధిస్తారు. లేదంటే రెండూ విధించే అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు, ఈ గేయాన్ని ఎక్కడ ఆలపించినా కేవలం కొన్ని చరణాల‌నే పాడ‌కుండా పూర్తి గేయాన్ని ఆల‌పించేలా నిబంధనను కూడా ఇందులో చేర్చారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్స వేడుకలు ఏడాది పొడవునా కేంద్రం నిర్వహిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌ణ‌కు ఉన్నట్టే జాతీయం గేయమైన‌ వందేమాతరంనకు కూడా చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

Also Read..

ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు ఇక చెక్‌.. పేప‌ర్ లీక్ బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

వాట‌ర్ లాగింగ్‌ను నివారించండి.. ట్రాఫిక్‌కు అంత‌రాయం లేకుండా చూడండి

స్టాక్ మార్కెట్‌ల‌లో జోష్.. సెన్సెక్స్ 888, నిఫ్టీ 264 పాయింట్లు పైకి..

Advertisement
Advertisement