Cyberabad | వాటర్ లాగింగ్‌ను నివారించండి.. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడండి
Cyberabad | మల్కంచెరువు పరిధిలో వాటర్ లాగింగ్‌ను నివారించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం రమేశ్ ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Cyberabad | త్రినేత్ర.న్యూస్ : మల్కంచెరువు పరిధిలో వాటర్ లాగింగ్‌ను నివారించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం రమేశ్ ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కంచెరువు వాటర్‌లాగింగ్ పాయింట్, సిటీ వైన్స్ వాటర్‌లాగింగ్ ప్రాంతాన్ని, అలాగే మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ (COD) పైప్‌లైన్ పనుల పురోగతిని సీపీ సంబంధిత సివిక్ బాడీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వాటర్‌లాగింగ్ సమస్యకు కారణమవుతున్న అంశాలను అధికారులు వివరించగా, వర్షపు నీరు వేగంగా వెళ్లేలా అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని సీపీ సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించడం, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
అలాగే సీఓడీ పైప్‌లైన్ పనులను వేగవంతం చేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనుల జరుగుతున్న ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు, అవసరమైన ట్రాఫిక్ మళ్లింపులపై ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్‌తో పాటు సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్ ప్రీత్ సింగ్, సీఎంసీ కమిషనర్ సృజన, శేరిలింగంపల్లి ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎంసీ డిప్యూటీ కమిషనర్, ఏఈ/ఏఈఈ అధికారులు, హైడ్రా సిబ్బంది, ఇతర సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 888, నిఫ్టీ 264 పాయింట్లు పైకి..
- ●NEET Student | మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
- ●LIC Dividend | మోదీ ప్రభుత్వానికి ఎల్ఐసీ బోనాంజా.. రూ.12,207 కోట్ల డివిడెండ్
- ●MLA Sudheer Reddy | రియల్ ఎస్టేట్ కుదేలుకు హైడ్రానే కారణం
- ●Instagram Scam | ఇన్స్టాగ్రామ్ ఐపీవో పేరుతో భారీ మోసం.. రూ.12 లక్షలు కోల్పోయిన వ్యక్తి..
- ●ZEE 5 | ఏడు భాషల్లో అతిపెద్ద కంటెంట్ లైనప్‌తో జీ5 సంచలనం.. తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు..!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 888, నిఫ్టీ 264 పాయింట్లు పైకి..

NEET Student | మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య

LIC Dividend | మోదీ ప్రభుత్వానికి ఎల్ఐసీ బోనాంజా.. రూ.12,207 కోట్ల డివిడెండ్

MLA Sudheer Reddy | రియల్ ఎస్టేట్ కుదేలుకు హైడ్రానే కారణం





