Instagram Scam | ఇన్‌స్టాగ్రామ్ ఐపీవో పేరుతో భారీ మోసం.. రూ.12 లక్షలు కోల్పోయిన వ్యక్తి..
Instagram Scam | మహారాష్ట్రలోని వార్ధా జిల్లా సిండి ప్రాంతానికి చెందిన ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఆన్‌లైన్ పెట్టుబడి మోసానికి బలై రూ.12 లక్షలకు పైగా కోల్పోయాడు.
Instagram Scam | మహారాష్ట్రలోని వార్ధా జిల్లా సిండి ప్రాంతానికి చెందిన ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఆన్‌లైన్ పెట్టుబడి మోసానికి బలై రూ.12 లక్షలకు పైగా కోల్పోయాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ నోటిఫికేషన్‌లోని లింక్‌పై క్లిక్ చేయడంతో ఈ భారీ మోసం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ లింక్‌పై క్లిక్ చేసిన అనంతరం బాధితుడిని ఐపీఓలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై సలహాలు ఇస్తామని చెప్పే పలు వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. అనంతరం మోసగాళ్లు అతడిని ఒక ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రలోభపెట్టారు. ఆ యాప్ ద్వారా వివిధ షేర్లు, ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టాలని నమ్మించి మొత్తం రూ.12,33,327 పెట్టుబడి పెట్టించారు. మొదట్లో ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించిన నిందితులు, బాధితుడు తన డబ్బును వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించిన సమయంలో అసలు మోసం బయటపడింది.
మహారాష్ట్రలో పెరుగుతున్న సైబర్ మోసాలు..
డబ్బు విత్‌డ్రా చేసే ముందు తప్పనిసరిగా ప్రాసెసింగ్ ఛార్జీగా మరో రూ.3 లక్షలు చెల్లించాలని మోసగాళ్లు డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయిన విషయాన్ని బాధితుడు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా వార్ధా సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మోసగాళ్లను గుర్తించి పట్టుకునేందుకు విచారణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో ఇలాంటి పెట్టుబడి మోసాలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియా నోటిఫికేషన్లు లేదా సందేశాల ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి, ముందుగా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి, తర్వాత నకిలీ ట్రేడింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయించే విధానాన్ని మోసగాళ్లు అనుసరిస్తున్నారని వెల్లడించారు. పెట్టుబడిదారులు డబ్బు వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు అదనపు ఛార్జీలు, పన్నులు లేదా ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో మరింత డబ్బు డిమాండ్ చేయడం ఈ తరహా మోసాల్లో సాధారణ పద్ధతిగా మారిందని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
అధికారుల హెచ్చరికలు..
ప్రజలకు అధికారులు ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే అపరిచిత పెట్టుబడి లింక్‌లపై క్లిక్ చేయొద్దని, అధిక లాభాలు వస్తాయని హామీ ఇచ్చే వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరొద్దని హెచ్చరించారు. పెట్టుబడి పెట్టే ముందు ట్రేడింగ్ యాప్ లేదా పెట్టుబడి వేదిక నిజమైనదేనా అనే విషయాన్ని అధికారిక నియంత్రణ సంస్థల ద్వారా తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని సూచించారు.
తాజావార్తలు
- ●Srinivas Goud | ఓబీసీలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే : శ్రీనివాస్ గౌడ్
- ●Anti Paper Leak Bill | పరీక్షల్లో అక్రమాలకు ఇక చెక్.. పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- ●Kavya Thapar | కావ్య థాపర్‌కు మరో ఛాన్స్.. ‘నేను రెడీ’తోనైనా అదృష్టం కలిసొచ్చేనా?
- ●Guru Purnima | షిర్డీలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.. రూ.1.03కోట్ల బంగారు కిరీటాన్ని బహూకరించిన ఏపీ భక్తుడు
- ●Harish Rao | క్యాన్సర్‌కు భయపడాల్సిన అవసరం లేదు.. ఆలస్యం చేస్తేనే ప్రమాదం
- ●Minister Vivek | పరిశ్రమల్లో భద్రతే తొలి ప్రాధాన్యం..

Srinivas Goud | ఓబీసీలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే : శ్రీనివాస్ గౌడ్

Anti Paper Leak Bill | పరీక్షల్లో అక్రమాలకు ఇక చెక్.. పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Kavya Thapar | కావ్య థాపర్‌కు మరో ఛాన్స్.. ‘నేను రెడీ’తోనైనా అదృష్టం కలిసొచ్చేనా?

Guru Purnima | షిర్డీలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.. రూ.1.03కోట్ల బంగారు కిరీటాన్ని బహూకరించిన ఏపీ భక్తుడు



